Serial Actress: అర్ధరాత్రి తప్పతాగి సీరియల్ నటీనటుల రచ్చ.. అరెస్ట్!

ఒకపక్క కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్నా.. బార్లు, పబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మెట్రో నగరాల్లో..

Serial Actress: అర్ధరాత్రి తప్పతాగి సీరియల్ నటీనటుల రచ్చ.. అరెస్ట్!

Serial Actress

Updated On : January 30, 2022 / 3:21 PM IST

Serial Actress: ఒకపక్క కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్నా.. బార్లు, పబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మెట్రో నగరాల్లో ఈ వ్యాపారానికి వచ్చిన ఎలాంటి నష్టం లేదు. ఇక ఇక్కడ అక్కడా అని లేకుండా దాదాపుగా దేశవ్యాప్తంగా సినిమా, సీరియళ్ల పరిశ్రమలో ఈసారి కరోనా కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయినా.. కొందరు సీరియళ్ల నటీనటులు అర్ధరాత్రి తప్పతాగి రచ్చ చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది బెంగళూరు నగరంలో జరిగింది.

NTR30: లీడర్ గా తారక్.. పొలిటికల్ స్పెషల్ గా కొరటాల సినిమా?

బెంగళూరు కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రిసార్టులో తాజాగా ఓ పార్టీ జరిగింది. కన్నడకి చెందిన బుల్లితెర నటీనటులు కొందరు పార్టీ పేరుతో మద్యం సేవించి రచ్చ రచ్చ చేశారు. సీరియల్ నటీనటులు భార్యాభర్తలైన రక్షిత్ – అనూషా, అభిషేక్.. రంజన్.. రాకేశ్.. రవిచంద్రన్ లు అర్థరాత్రి వేళలో ఒక రిసార్టులో ఫుల్ గా తాగేసి రచ్చ చేశారు. జనవరి 27 తేదీ రాత్రి ఇది జరిగింది.

Radhe Shyam: రాధేశ్యామ్ పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఇదే?

అర్థరాత్రి తప్పతాగి గోల చేస్తున్నట్లుగా కెంగేరి పోలీసుల ఫిర్యాదు రావడంతో పోలీసులు రిసార్ట్ కి వచ్చి వారిని అదుపులోకి తీసుకుని న్యూసెన్సు కేసు నమోదు చేశారు. ముందుగా పోలీసులు నటీనటులను నచ్చజెప్పాలని చూసినా మద్యం మత్తులో వాళ్ళు వినే పరిస్థితి లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కి తరలించి న్యూసెన్స్ కేసు నమోదు చేసి ఉదయం విడుదల చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా రచ్చ వ్యవహారం కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.