Shah Rukh Khan : గర్ల్ విత్ గోల్డెన్ హార్ట్.. స్టార్ హీరో కూతురు ఇలా చేస్తుందని ఊహించలేదు.. వీడియో వైరల్
బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల గారాల పట్టీ సుహానా ఖాన్ (Suhana Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

Suhana Khan gives Rs 1000 to needy woman
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల గారాల పట్టీ సుహానా ఖాన్ (Suhana Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా సుహానాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటీజన్లు నిజంగా అమ్మడిది గోల్డెన్ హార్ట్ అని అంటున్నారు.
శుక్రవారం ముంబై నగరంలోని జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తన తల్లి గౌరీఖాన్‌తో కలిసి సుహానా వెళ్లింది. కబీర్ బేడీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈవెంట్ పూర్తి అయిన తరువాత వీరు తిరిగి వెలుతున్న సమయంలో ఓ పేద మహిళ సాయం చేయాలంటూ సుహానాను కోరింది. వెంటనే ఈ స్టార్ కిడ్ ఇంకేం ఆలోచించకుండా తన హ్యాండ్ బ్యాగ్‌లోంచి పర్సును తీసి రెండు 500 నోట్లను తీసి ఆ మహిళకు ఇచ్చింది.
Boys Hostel : చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నుంచి మరో కొత్త సినిమా.. బాయ్స్ హాస్టల్.. హ్యాట్రిక్ కొడతారా?
దీంతో సదరు మహిళ ఆనందంతో పొంగిపోయింది. ఆ వెంటనే సుహానా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్‌గా మారగా.. ఎంత మంచి మనసు తల్లీ నీది అని ఒకరు కామెంట్ చేయగా, గర్ల్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే.. సుహానా త్వరలో జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ‘ది ఆర్చీస్’తో ఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది చివరల్లో ఇది ఓటీటీలో విడుదల కానుంది. ది ఆర్చీస్‌లో వెరోనికా పాత్రలో సుహానా కనిపించనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ఇందులో శ్రీదేవి, బోనీ కపూర్‌ల చిన్న కూతురు ఖుషీ కపూర్,అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటించారు.
Sudha Murthy :ప్రభాస్ సినిమా పాటంటే సుధామూర్తికి చాలా ఇష్టమంట.. ఏ పాటో తెలుసా?
View this post on Instagram