Shah Rukh Khan: వాలెంటైన్స్ డే కానుకగా షారుక్ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ మూవీ..!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దాదాపు దశాబ్ద కాలం తరువాత షారుక్ ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు సంతోషంతో కాలర్ ఎగరేస్తున్నారు. ఎంతమంది హీరోలు ఉన్నా, బాద్‌షా ఒక్కడే అంటూ షారుక్‌ను ఆకాశానికెత్తుతున్నారు.

Shah Rukh Khan: వాలెంటైన్స్ డే కానుకగా షారుక్ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ మూవీ..!

Shah Rukh Khan Dilwale Dulhania Le Jayenge To Re-Release As Valentines Day Gift

Updated On : February 10, 2023 / 5:01 PM IST

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దాదాపు దశాబ్ద కాలం తరువాత షారుక్ ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు సంతోషంతో కాలర్ ఎగరేస్తున్నారు. ఎంతమంది హీరోలు ఉన్నా, బాద్‌షా ఒక్కడే అంటూ షారుక్‌ను ఆకాశానికెత్తుతున్నారు.

Shah Rukh Khan ThumsUp Ad : పఠాన్ రేంజ్‌లో షారుఖ్ థమ్సప్ యాడ్..

ఇక ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తుండగా, ఇప్పుడు షారుక్ నటించిన మరో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఇది కొత్త సినిమా కాదులెండీ. షారుక్ కెరీర్‌లో బెస్ట్ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా నిలిచిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా ఒక వారం రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Shah Rukh Khan: చరణ్ తీసుకెళ్తే పఠాన్ సినిమా చూస్తానంటోన్న కింగ్ ఖాన్!

ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షారుక్ సరసన అందాల భామ కాజోల్ హీరోయిన్‌గా నటించగా, ఇండియాలో అత్యధిక రోజులు రన్ అయిన హిందీ మూవీగా ఈ సినిమా ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 10 నుండి దేశంలోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో కేవలం వారం రోజుల పాటు ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ రొమాంటిక్ మూవీని మళ్లీ ఎంతమంది థియేటర్లలో వీక్షిస్తారో చూడాలి.