Shah Rukh Khan : ఇది బిజినెస్ కాదు, పర్సనల్.. పఠాన్ పై షారుఖ్ ఎమోషనల్ ట్వీట్!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'పఠాన్'. ఇంతటి హిట్ అందించడంతో షారుఖ్ ఖాన్.. థాంక్యూ చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

Shah Rukh Khan
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పఠాన్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించగా జాన్ అబ్రహం విలన్ గా కనిపించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించే సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు పెద్ద రచ్చే జరిగింది. సినిమాలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయి అంటూ, మూవీని రిలీజ్ కనివ్వమంటూ వార్నింగ్ లు కూడా ఎదురుకున్నారు చిత్ర యూనిట్.
Pathaan: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న పఠాన్.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
ఇంతటి వ్యతిరేకత మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అసలు పెట్టిన బడ్జెట్ అయినా రాబడుతుందా? అని అనుకున్న సినిమా.. నేడు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి-2 రికార్డుని కూడా బ్రేక్ చేసింది. ఇక ఇంతటి హిట్ అందించడంతో షారుఖ్ ఖాన్.. థాంక్యూ చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
”సినిమా అనేది బిజినెస్ కాదు, సినిమా అనేది ఖచ్చితంగా వ్యక్తిగతం. నవ్వించడం, అలరించడం మా వ్యాపారం. దానిని వ్యక్తిగతంగా తీసుకోకపోతే, అది ఎప్పటికీ ఎదగదు. పఠాన్ సినిమాని ఇంతటి హిట్ చేసిన ఆడియన్స్ కి మరియు చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వవని మరోసారి నిరూపించారు” అంటూ ట్వీట్ చేశాడు.
కాగా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటించబోతుంది. షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ చేయబోతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడు.
“ITS NOT THE BUSINESS….ITS STRICTLY PERSONAL”. Making ppl smile & entertaining them is our business & if we don’t take it personally….it will never fly. Thanks to all who gave Pathaan love & all who worked on the film & proved ki mehnat lagan aur bharosa abhi Zinda Hai.Jai Hind
— Shah Rukh Khan (@iamsrk) March 8, 2023