Jawan Collections : ఇంకా కొనసాగుతున్న జవాన్ కలెక్షన్స్ జోరు.. 1200 కోట్ల టార్గెట్..!
షారుఖ్ తన సొంత నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జవాన్ సినిమా.. సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్తుంది. 1200 కోట్ల టార్గెట్ గా ముందుకు వెళ్తుంది.

Shah Rukh Khan Jawan movie collections running toward 1200 crores
Jawan Collections : తమిళ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ సినిమాలో ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. షారుఖ్ తన సొంత నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్తుంది.
మొదటి నాలుగు రోజుల్లో 400 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ మూవీ.. 10 రోజుల్లో దాదాపు 800 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇక మూడు వారాలు పూర్తి అయ్యేపాటికి 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. అయితే ఈ మూవీ కలెక్షన్స్ వేట అక్కడితో ఆగిపోలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కలెక్షన్స్ రాబడుతూ.. 1200 కోట్ల టార్గెట్ గా ముందుకు వెళ్తుంది. ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1125.20 గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు అట్లీ తెలియజేశాడు.
Also read : Dunki : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ పోస్టుపోన్ అవుతుందా..? ప్రభాస్ సలార్‌తో పోటీకి రావడం లేదా..?
View this post on Instagram
ఇటీవలే ఈ మూవీ మేకర్స్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ ఒక ఆఫర్ కూడా పెట్టారు. ఇక నేడు నేషనల్ సినిమా డే కావడంతో.. PVR సినిమాస్ రూ.99లకే సినిమాని ఆడియన్స్ కి అందిస్తుంది. దీంతో బుకింగ్స్ ద్వారా ఈరోజు జవాన్ కి మంచి కలెక్షన్స్ నమోదు అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. షారుఖ్ పఠాన్ చిత్రం 1000 కోట్ల మార్క్ దగ్గరే ఆగిపోయింది. జవాన్ ని ఎలాగైనా 1200 వరకు తీసుకు వెళ్లాలని మేకర్స్ తెగ కష్టపడుతున్నారు. వచ్చే వారం పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరి జవాన్ 1200 ని చేరుకుంటాడో లేదో చూడాలి.