Shahrukh Khan : ఆ యాడ్ చేసినందుకు షారుఖ్ ఇల్లు ముట్టడికి యత్నం.. యువతని పక్కదారి పట్టిస్తున్నారంటూ..

బాలీవుడ్ హీరోలు చేసే యాడ్స్ పై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి, కోర్టు కేసులు కూడా అయ్యాయి. అయినా కొంతమంది హీరోలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఎలాంటి యాడ్స్ అయినా చేసేస్తున్నారు.

Shahrukh Khan : ఆ యాడ్ చేసినందుకు షారుఖ్ ఇల్లు ముట్టడికి యత్నం.. యువతని పక్కదారి పట్టిస్తున్నారంటూ..

Shahrukh Khan act in a Online rummy gaming app Advertisement Untouch Youth Foundation protest at Shahrukh House

Updated On : August 29, 2023 / 8:59 AM IST

Shahrukh Khan :  మన స్టార్ హీరోలు సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేసి కోట్లు సంపాదిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది హీరోలు సెలెక్టీవ్ గా యాడ్స్(Ads) సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది మాత్రం డబ్బుల కోసం అన్ని యాడ్స్ చేసేస్తూ ఉంటారు. బాలీవుడ్(Bollywood) హీరోల్లో కొంతమంది పాన్ మసాలా, ఆన్లైన్ గేమింగ్ యాప్స్, ఆల్కహాల్ లాంటి యువతను పక్కదోవ పట్టించేవాటికి కూడా యాడ్స్ చేస్తూ ఉంటారు.

బాలీవుడ్ హీరోలు చేసే యాడ్స్ పై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి, కోర్టు కేసులు కూడా అయ్యాయి. అయినా కొంతమంది హీరోలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఎలాంటి యాడ్స్ అయినా చేసేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చేసిన ఓ యాడ్ ని విమర్శిస్తున్నారు. ఓ ఆన్లైన్ రమ్మీ గేమింగ్ యాప్(Online Rummy Gaming App) కోసం షారుఖ్ యాడ్ చేసాడు. ఇది ఎప్పుడో చేసినా ఇటీవల ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలా మంది యువత డబ్బులు, విలువైన సమయం పోగొట్టుకుంటున్నారు.

Armaan Malik : నిశ్చితార్థం చేసుకున్న బుట్టబొమ్మ సింగర్.. ఎవరితోనో తెలుసా?

ఆన్లైన్ గేమింగ్ ని వ్యతిరేకించి, వాటి నుంచి యువతని కాపాడే ఓ NGO సంస్థ అయిన అన్‌టచ్‌ ఇండియా ఫౌండేషన్‌ షారుక్ పై ఈ యాడ్ చేసినందుకు విమర్శలు చేసింది. ఒక స్టార్ హీరో హోదాలో ఉంది యువతని పక్కదారి పట్టించే ఇలాంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కి యాడ్స్ చేయడమేంటి అని ప్రశ్నిస్తూ ఈ ఫౌండేషన్ కి సంబంధిచిన కొంతమంది ముంబై బాంద్రాలోని షారుఖ్ ఇల్లు మన్నత్ ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు ఈ విషయం తెలిసి ఆ ఫౌండేషన్ కి చెందిన సభ్యులని అడ్డుకున్నారు. షారుఖ్ ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఈ సంఘటన బాలీవుడ్ లో వైరల్ గా మారింది.