చిన్న నటుడి పెద్ద మనసు.. భిక్షాటన చేసి ఏడు కుటుంబాలకు సాయమందించిన షకలక శంకర్..

  • Published By: sekhar ,Published On : September 17, 2020 / 08:14 PM IST
చిన్న నటుడి పెద్ద మనసు.. భిక్షాటన చేసి ఏడు కుటుంబాలకు సాయమందించిన షకలక శంకర్..

Updated On : September 17, 2020 / 8:23 PM IST

Shakalaka Shankar help 7 Families: ఇటీవల తన ‘నటనార్జితం’ నుంచి లక్షా పది వేలు వెచ్చించి… ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన కమెడియన్‌, నటుడు షకలక శంకర్‌ తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు.


ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టారు. భిక్షాటన ద్వారా సుమారు 90 వేలు సమకూరగా… మిగిలిన డబ్బులు తను జోడించి, మొత్తం లక్ష రూపాయలతో… కరీంనగర్‌లోని ఏడు కుటుంబాలకు ఆయన ఆర్ధిక సాయం అందించారు.


ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి… అందుకు తనకు సహకరించిన కరీంనగర్‌కు చెందిన మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బిటిఆర్‌లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొక పర్యాయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహించాలని వేడుకుంటున్నానని ఈ సందర్భంగా షకలక శంకర్ తెలిపారు.

Shakalaka Shankar

Shakalaka Shankar