Sharma and Ambani : ఈ విన్ ఓటీటీలో రాబోతున్న క్రైం కామెడీ థ్రిల్లర్.. ‘శర్మ అండ్ అంబానీ’.. ఎప్పట్నించి అంటే?

ఈ క్రమంలోనే శర్మ అండ్ అంబానీ అనే క్రైం కామెడీ సినిమాని తీసుకురాబోతుంది ఈ విన్.

Sharma and Ambani : ఈ విన్ ఓటీటీలో రాబోతున్న క్రైం కామెడీ థ్రిల్లర్.. ‘శర్మ అండ్ అంబానీ’.. ఎప్పట్నించి అంటే?

Sharma and Ambani Crime Comedy Movie Streaming in ETV Win OTT Release Date Announced

Updated On : April 8, 2024 / 8:24 AM IST

Sharma and Ambani : ఇటీవల థ్రిల్లర్ సినిమాలు, క్రైం కామెడీలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. అందులోను ఓటీటీలలో ఇంకా బాగా రీచ్ అవుతున్నాయి ప్రేక్షకులకు. ఈ విన్ ఓటీటీ ఇటీవల వరుసగా మంచి మంచి సిరీస్ లు, సినిమాలు అందిస్తుంది. ఈ క్రమంలోనే శర్మ అండ్ అంబానీ అనే క్రైం కామెడీ సినిమాని తీసుకురాబోతుంది.

భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా శర్మ అండ్ అంబానీ. అనిల్ పల్లా, భరత్ నిర్మాణంలో కార్తీక్ సాయి దర్శకత్వంలో శర్మ అండ్ అంబానీ తెరకెక్కింది. ఇటీవల ఆల్రెడీ మనమే రాజా.. అనే ఓ పాటతో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఇక ఈ శర్మ అండ్ అంబానీ సినిమా ఏప్రిల్ 11 నుండి ఈ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Also Read : Allu Arjun : అర్ధరాత్రి అభిమానుల కోసం అల్లు అర్జున్.. బర్త్‌డే విషెష్ చెప్పడానికి బన్నీ ఇంటి ముందు భారీగా ఫ్యాన్స్..

శర్మ ఆయుర్వేద మందులు అమ్ముకుంటూ ఉంటాడు, అంబానీ షూ పాలిష్, చెప్పులు కుట్టడం వంటివి చేస్తాడు. వీరిద్దరూ ఫ్రెండ్స్ గా మారి ఎక్కడో ఓ గ్యాంగ్ లో మిస్ అయిన డైమండ్స్ వీరి చేతిలోకి వస్తే ఏం జరిగింది అనే ఆసక్తికర కథాంశంతో క్రైం కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది.