Sharwanand : యాక్సిడెంట్ పై శర్వానంద్ ట్వీట్.. నేను క్షేమంగానే ఉన్నాను!

ఈరోజు ఉదయం శర్వానంద్ కి యాక్సిడెంట్ జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా యాక్సిడెంట్ పై స్పందిస్తూ శర్వా ట్వీట్ చేశాడు.

Sharwanand : యాక్సిడెంట్ పై శర్వానంద్ ట్వీట్.. నేను క్షేమంగానే ఉన్నాను!

Sharwanand tweet on his accident at hyderabad film nagar

Updated On : June 2, 2023 / 6:43 PM IST

Sharwanand : టాలీవుడ్(Tollywood) హీరో శర్వానంద్ ఈరోజు (మే 28) ఉదయం యాక్సిడెంట్ కి గురి అయ్యినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ (Hyderabad) ఫిలింనగర్ జంక్షన్ వద్ద శర్వానంద్ తన రేంజ్ రోవర్ కారులో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ బయటకి రావడంతో అందరూ టెన్షన్ పడ్డారు. ఇక దాని పై శర్వానంద్ టీం వివరణ ఇచ్చింది. శర్వానంద్ పయనిస్తున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు. అయితే అది చాలా చిన్న యాక్సిడెంట్ అని, ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదని తెలియజేశారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలిలో..

తాజాగా శర్వానంద్ తన సోషల్ మీడియా ద్వారా యాక్సిడెంట్ పై స్పందించాడు. “ఈరోజు ఉదయం నా కారు యాక్సిడెంట్ న్యూస్ విని అందరూ కంగారు పడ్డారు. అయితే చాలా చిన్న సంఘటన. నేను పూర్తి క్షేమంగానే ఉన్నాను. భయపడాల్సిన అవసరం ఏమి లేదు. మీ ప్రేమకి థాంక్యూ” అంటూ ట్వీట్ చేశాడు. ఇక స్వయంగా శర్వానంద్ ట్వీట్ చేయడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు. కాగా శర్వానంద్ కి మరో వారం రోజుల్లో పెళ్లి జరగనుంది.

Prabhas : సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?? ఎప్పటికో?

జనవరి 26న శర్వానంద్.. రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం జూన్ 3న జైపూర్ (Jaipur) ప్యాలెస్ లో జరగబోతుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చేయడం, పలు కార్యక్రమాలు జరగనున్నాయి. జూన్ 3 రాత్రి రక్షితతో కలిసి శర్వానంద్ ఏడడుగులు వెయ్యనున్నాడు. ఇక ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు సమాచారం.