Sharwanand : ఓ ఇంటివాడైన శర్వానంద్.. మోగిన పెళ్లి బాజాలు..

జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, అదే రోజు రాత్రి సంగీత్ వేడుక జరిగింది. శర్వా పెళ్లి వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక జూన్ 3 రాత్రి 11 గంటలకు శర్వానంద్ వివాహం జరిగింది.

Sharwanand : ఓ ఇంటివాడైన శర్వానంద్.. మోగిన పెళ్లి బాజాలు..

Sharwanand Wedding happened with Rakshita in Jaipur

Updated On : June 4, 2023 / 6:28 AM IST

Sharwanand Wedding : టాలీవుడ్(Tollywood) లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన శర్వానంద్(Sharwanand) ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ప్రకటన లేకుండా సడన్ గా నిశ్చితార్ధం చేసుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు రక్షిత(Rakshita)ను శర్వా వివాహం చేసుకున్నాడు. రక్షిత ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది.

జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, అదే రోజు రాత్రి సంగీత్ వేడుక జరిగింది. శర్వా పెళ్లి వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక జూన్ 3 రాత్రి 11 గంటలకు శర్వానంద్ వివాహం జరిగింది. మొత్తానికి ఇన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్ గడిపిన శర్వా ఓ ఇంటివాడయ్యాడు.

Aishwarya Lekshmi: ఆ సినిమాల‌పై న‌మ్మ‌కం లేదు.. న‌టిని అవుతానంటే.. త‌ల్లిదండ్రులే వ‌ద్ద‌న్నారు

శర్వానంద్ పెళ్ళికి రామ్ చరణ్, సిద్దార్థ్, నిర్మాత వంశీ, అనురాగ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇక ఇరువైపులా బంధువులు, సన్నిహితులు కూడా విచ్చేయగా పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి ఫోటోలను ఇంకా బయటకు రిలీజ్ చేయలేదు.