కామోష్.. నెటిజన్స్ ఆటాడుకుంటున్నారుగా!

మీటూ గురించి కామెంట్సే చేసి, విమర్శలు ఎదుర్కొంటున్నాడు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కమ్ పొలిటిషియన్ శత్రుఘ్న సిన్హా.

  • Published By: sekhar ,Published On : February 7, 2019 / 09:59 AM IST
కామోష్.. నెటిజన్స్ ఆటాడుకుంటున్నారుగా!

Updated On : February 7, 2019 / 9:59 AM IST

మీటూ గురించి కామెంట్సే చేసి, విమర్శలు ఎదుర్కొంటున్నాడు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కమ్ పొలిటిషియన్ శత్రుఘ్న సిన్హా.

హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం, గతేడాది  దక్షిణాది సినీ పరిశ్రమలని అల్లాడించింది. ఎందరో నటీమణులు, చాలామంది సినీ పెద్దల బాగోతాలని బయట పెట్టారు. ఎప్పుడు ఎవరి పేరు వినాల్సి వస్తుందోనని చాలామంది సినీ పెద్దలు భయంతో వణికిపోయారు. కొందరు పోలీసు కంప్లైంట్‌లు, కోర్టుల వరకూ వెళ్ళారు కూడా. మీటూ గురించి తమ స్పందన తెలియచేసిన వాళ్ళకి సోషల్ మీడియాలో చురకలంటించిన సంఘటనలూ మనం చూసాం. ఇప్పుడు మీటూ గురించి అలాంటి కామెంట్సే చేసి, విమర్శలు ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కమ్ పొలిటిషియన్ శత్రుఘ్న సిన్హా.

రీసెంట్‌గా బాంబేలో జరిగిన ఒక బుక్ లాంచ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన శత్రుని, మీటూ గురించి ప్రశ్నించగా, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు కదా, అలాగే, నాశనమయ్యే ప్రతి మగాడి వెనక కూడా, ఆ ఆడదే ఉంటుంది అన్నాడు. అంతే, సోషల్ మీడియాలో ఆయణ్ణి ఒక ఆట ఆడుకుంటున్నారు. శత్రుఘ్న సిన్హా సిగ్నేచర్ డైలాగ్ కామోష్‌ని గుర్తు చేస్తూ, మాట్లాడే ముందు కాస్త ముందూ, వెనకా ఆలోచించి మాట్లాడండి అని సలహా ఇస్తున్నారు. ఈ కామెంట్స్‌పై ఆయనెలా స్పందిస్తాడో చూడాలి.