Pourusham – The Man Hood : ‘పౌరుషం – ది మ్యాన్‌హుడ్’ ట్రైలర్ రిలీజ్..

తాజాగా పౌరుషం - ది మ్యాన్‌హుడ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అమెరికా లాస్ ఏంజిల్స్ లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగగా..

Pourusham – The Man Hood : ‘పౌరుషం – ది మ్యాన్‌హుడ్’ ట్రైలర్ రిలీజ్..

Sheraz Mehdi Pourusham The Man Hood Trailer Released

Pourusham – The Man Hood Trailer : షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పౌరుషం – ది మ్యాన్‌హుడ్’. అమెరికాకు చెందిన UVT హాలీవుడ్ స్టూడియోస్, శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, కెవ్వు కార్తీక్, జబర్దస్త్ హీనా, రవి వర్మ.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తాజాగా పౌరుషం – ది మ్యాన్‌హుడ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అమెరికా లాస్ ఏంజిల్స్ లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి.. పలువురు హాజరయ్యారు.

Also Read : Aarambham : ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ ‘ఆరంభం’..

ఈ సినిమా డైరెక్టర్ షేరాజ్ మెహ్దీ సంగీతం కూడా అందించారు. ఇక ట్రైలర్ చూస్తుంటే లవ్ యాక్షన్ కథతో పాటు డివోషనల్ కంటెంట్ కూడా పెట్టి కమర్షియల్ గా ఈ సినిమాని తీస్తున్నారు అని తెలుతెస్తుంది.