Shilpa Shetty : పోలీసుల ముందు కంటతడి.. భర్తతో గొడవకు దిగిన శిల్పా శెట్టి..

మానసిక వేదనతో పాటు ఆర్థికంగానూ నష్టపోతున్నామని చెబుతూ శిల్పా శెట్టి కంటతడి పెట్టుకుందని, పోలీసుల ముందే భర్తతో వాగ్వాదానికి దిగిందని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి..

Shilpa Shetty : పోలీసుల ముందు కంటతడి.. భర్తతో గొడవకు దిగిన శిల్పా శెట్టి..

Shilpa Shetty

Updated On : July 26, 2021 / 4:16 PM IST

Shilpa Shetty: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ గుట్టు రట్టవడంతో చాలా మంది సెలబ్రిటీల పేర్లు బయటకి వస్తున్నాయి. దీని వెనుక పెద్ద మాఫియానే నడుస్తున్నట్టు గుర్తించిన పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ కంపెనీ డైరెక్టర్లలో శిల్పా శెట్టి ఒకరిగా ఉన్నారు. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Raj Kundra : ఆ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా రోజుకు ఎంత సంపాదించేవాడంటే..

రీసెంట్‌గా పోలీసులు శిల్పా శెట్టిని ఆమె ఇంటిలో ఏకంగా ఆరు గంటలపాటు విచారించారు. భర్త చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యవహారాల్లో ఆమెకేమైనా వాటా ఉందా?.. వియాన్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న శిల్పా ఉన్నట్టుండి గతేడాది ఆ బాధ్యతల నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి? అనే విషయాల గురించి పోలీసులు శిల్పాను ఇంటరాగేట్ చేశారు.

Shilpa Shetty : భర్త వ్యవహారంతో శిల్పా శెట్టికి సెగ?

అయితే విచారణ సమయంలో.. ఈ వ్యవహారం వల్ల తమ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిందని, ఇప్పటికే పలు అగ్రిమెంట్లు క్యాన్సిల్ అయ్యాయని, మానసిక వేదనతో పాటు ఆర్థికంగానూ నష్టపోతున్నామని చెబుతూ శిల్పా శెట్టి కంటతడి పెట్టుకుందని, పోలీసుల ముందే భర్తతో వాగ్వాదానికి దిగిందని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
తన భర్త శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప అశ్లీల చిత్రాలు తియ్యరని, హాట్‌షాట్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే కంటెంట్‌ గురించి తనకి ఎలాంటి అవగాహన కానీ, దాంట్లో తన ప్రమేయం కానీ ఏమీ లేదని ఆమె. వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Raj Kundra : భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి.. రిమాండ్ పొడిగించిన పోలీసులు..