Gaami : విశ్వక్ సేన్ ‘గామి’ నుంచి.. ‘శివమ్’ సాంగ్ రిలీజ్..

గామి స్పిరిట్ ని తెలియజేసే 'శివమ్' సాంగ్ ని రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ అండ్ టీం.

Gaami : విశ్వక్ సేన్ ‘గామి’ నుంచి.. ‘శివమ్’ సాంగ్ రిలీజ్..

Shivam The spirit of Gaami song released by Vishwak Sen grandly

Gaami : విశ్వక్ సేన్ దాదాపు ఆరేళ్లు పాటు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన చిత్రం ‘గామి’. ఈ చిత్రం పై ఇటీవల వరకు ఎటువంటి అంచనాలు లేవు. కానీ టీజర్ అండ్ మేకింగ్ వీడియోతో మూవీ పై మంచి బజ్క్రియేట్ అయ్యింది. ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రతిఒక్కరు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

మార్చి 8న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగం గానే నేడు ‘శివమ్’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. శివ క్షేత్రం శ్రీశైలంలో ఈ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. నరేష్ కుమారన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా శంకర్ మహదేవన్ పాటని పాడారు. శ్రీమణి లిరిక్స్ ని అందించారు. గామి స్పిరిట్ ని తెలియజేసే ఈ ‘శివమ్’ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. మీరు ఓసారి వినేయండి.

Also read : Nagarjuna – Anshu Ambani : మళ్ళీ రీ యూనియన్ అయిన మన్మథుడు జంట.. ఫొటోలు వైరల్..

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరగా నటిస్తున్నారు. చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుంది. శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ అండ్ టీజర్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.