Balayya – Shiva Rajkumar : బాలయ్యతో సినిమా పై శివరాజ్ కుమార్ కామెంట్స్..

నందమూరి బాలకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా శివరాజ్ కుమార్, బాలయ్యతో సినిమా పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Balayya – Shiva Rajkumar : బాలయ్యతో సినిమా పై శివరాజ్ కుమార్ కామెంట్స్..

Balayya – Shiva Rajkumar movie

Balayya – Shiva Rajkumar : కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాలు అన్ని ఇప్పుడు వరుస పెట్టి ఇతర భాషల్లో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శివరాజ్ కుమార్ సినిమా ‘వేద’ కూడా తెలుగులో ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న (ఫిబ్రవరి 7) హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. కాగా ఇటీవల వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

Balayya – Shiva Rajkumar : పునీత్ AV చూసి శివరాజ్ కుమార్ కన్నీరు.. బాలయ్య ఓదార్పు!

తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ బాలయ్యతో సినిమా పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “గతంలో బాలకృష్ణ గారు నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో ఒక పాట కోసం నన్ను అడిగారు, నేను ఆలోచించకుండా ఒక చెప్పేశాను. ఆ అవకాశం ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. కానీ నాకు ఆ ఒక్క పాట సరిపోదు. బాలయ్య గారితో ఒక ఫుల్ లెన్త్ మూవీ చేయాలి. దాని కోసం నేను ఎదురు చూస్తుంటా” అంటూ తన ఆశాభావాన్ని తెలియజేశాడు. మరి ఈ వ్యాఖ్యలు విన్న తెలుగు, కన్నడ దర్శకులు వీరిద్దరి కోసం ఒక సినిమా తీసుకు వస్తారా? లేదా? చూడాలి. అభిమానులు అయితే ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగుండు అని ఫీల్ అవుతున్నారు.

అలాగే తారకరత్న గురించి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఇటీవల తారకరత్న గారు అనారోగ్యానికి గురైన సంగతి మనకి తెలిసిందే. కొడుకుని దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్న సమయంలో నేను అడిగానని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బాలకృష్ణ గారికి చాలా పెద్ద థాంక్యూ. తారకరత్న గారిని నేను హాస్పిటల్ కి వెళ్లి చూశాను. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ వ్యాఖ్యానించాడు.