Shobha Shetty : డాక్టర్ బాబు – వంటలక్కని కలపమని నా కాళ్ళు పట్టుకున్నారు..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా కార్తీక దీపం ఎఫెక్ట్ బయట ఎలా ఉందో చెప్పింది.

Shobha Shetty
Shobha Shetty : కార్తీక దీపం సీరియల్ తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. టీవీ ప్రేక్షకులు ఈ సీరియల్ కి, సీరియల్ లోని పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ సీరియల్ సీజన్ 2 నడుస్తుంది. ఈ సీరియల్ తో నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబుగా, ప్రేమి విశ్వనాధ్ వంటలక్కగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ లో మోనిత అనే నెగిటివ్ క్యారెక్టర్ లో శోభా శెట్టి నటించి ఫేమ్ తెచ్చుకుంది.
కార్తీక దీపం సీరియల్ లో శోభా శెట్టి వంటలక్కని ఇబ్బంది పెట్టె పాత్రలో, డాక్టర్ బాబు – వంటలక్కని దూరం చేయాలనే నెగిటివ్ పాత్రలో నటించింది. ఈ సీరియల్ తర్వాత టీవీ షోలు, బిగ్ బాస్ తో మరింత వైరల్ అయింది శోభా శెట్టి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా కార్తీక దీపం ఎఫెక్ట్ బయట ఎలా ఉందో చెప్పింది.
Also Read : Mahavatar Narsimha : ‘హరిహర వీరమల్లు’ను దెబ్బ కొట్టిన యానిమేషన్ సినిమా..
శోభా శెట్టి మాట్లాడుతూ.. ఒకసారి ఓ విలేజ్ కి వెళ్ళాను. అక్కడ ఓ ముసలావిడ వచ్చి నా చేతులు పట్టుకొని నువ్వు అలా చేయకు మోనిత, వంటలక్క – డాక్టర్ బాబుని కలుపు. వాళ్ళిద్దర్నీ కలిపేయ్ అని చెప్పింది. నేను అది సీరియల్ కలిపేస్తే అయిపోతుంది అని చెప్తే.. అదంతా నాకు తెలీదు, వాళ్ళను కలపండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని నా కాళ్ళ మీద పడబోయింది అని తెలిపింది.
అయితే మళ్ళీ తెలుగులో సీరియల్ ఎందుకు చెయ్యట్లేదు అని అడగ్గా.. మోనిత రేంజ్ క్యారెక్టర్ మళ్ళీ రాలేదు, అందుకే చేయలేదు. ఇటీవలే ఒక కథ విన్నాను, బానే ఉంది. దాంట్లో కొన్ని ఛేంజెస్ చెప్పాను. అవి ఛేంజ్ చేసి, ఛానల్ తో మాట్లాడి చెప్తామన్నారు. అది ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. కంఫర్మేషన్ వస్తే త్వరలో కొత్త సీరియల్ తో వస్తాను అని తెలిపింది.
Also Read : Rashmika Mandanna : మైసా.. రష్మిక కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..