Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ అండ్ క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగచైతన్య విడాకుల సమయంలో హాట్ టాపిక్ గా మారిన వేణు స్వామి గుర్తున్నారా.. సామ్.. చైతూ పెళ్లి సమయంలో వారి జాతకంలో

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

Venu Swamy

Updated On : October 23, 2021 / 3:00 PM IST

Venu Swamy: తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ అండ్ క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగచైతన్య విడాకుల సమయంలో హాట్ టాపిక్ గా మారిన వేణు స్వామి గుర్తున్నారా.. సామ్.. చైతూ పెళ్లి సమయంలో వారి జాతకంలో ఏదో దోషం ఉందని.. వాళ్ళు విడిపోతారని వేణుస్వామి ముందే చెప్పాడు. కానీ, అప్పుడు విమర్శలే ఎక్కువగా వినిపించాయి. అయితే, సామ్-చైతూ విడాకుల సమయంలో వేణు స్వామి గతంలో చెప్పిన మాటలను అందరూ గుర్తు చేసుకున్నారు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

కాగా, ఇప్పుడు అదే వేణు స్వామి మరో హీరోయిన్ విషయంలో కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలే చేశాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 31వ పుట్టినరోజు సందర్భంగా జాకీ భగ్నానీతో తన రిలేషన్‌ను బయటపెట్టిన రకుల్ త్వరలోనే త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లుగా కూడా ప్రకటించింది.

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

అయితే, వేణు స్వామి రకుల్ ప్రీత్‌ సింగ్‌-జాకీ భగ్నానీల పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుందని.. లేదని పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయని.. ముఖ్యంగా రకుల్‌ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం ఉంది అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

Sankranti 2022: ఆ నలుగురు.. సైడిస్తారా..? ఢీ కొడతారా..?

రకుల్‌- జాకీ భగ్నానీల జాతకాన్ని పరిశీలించిన వేణుస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో వేణుస్వామి కారణం కూడా చెప్పాడు. జాకీ భగ్నానీది మకర రాశి కాగా ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రకుల్‌ది మిధున రాశి కాగా ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు. మరి ఈ జంట దీనిపై స్పందిస్తారా.. లేక లైట్ తీసుకుంటారో చూడాలి.