షూటింగ్ స్పాట్ పిక్స్ వైరల్.. ఈ హీరోని గుర్తు పట్టారా?

Bob Biswas – Abhishek Bachchan: లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన స్టార్స్ ఒక్కొక్కరుగా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. దాదాపు 8 నెలల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీల షూటింగ్ స్పాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
పెద్ద కళ్లజోడు, బట్ట తలతో కామన్ మ్యాన్ తరహాలో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా?.. ఇంకెవరు, బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అభిషేక్ తన కొత్త సినిమా ‘బాబ్ బిస్వాస్’ కోసం ఈ గెటప్‌లోకి మారిపోయాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతోంది. ఆ సినిమా సెట్స్ నుంచి లీకైన అభిషేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నారు.
https://10tv.in/sai-pallavi-to-play-a-pivotal-role-in-pawan-kalyan-and-krish-movie/
దుబాయ్‌లో ‘రంగ్ దే’
నితిన్, కీర్తి సురేష్ జంటగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా ‘రంగ్ దే’. ప్రస్తుతం దుబాయ్‌లో షెడ్యూల్ జరుగుతోంది.అక్కడ షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నితిన్, కీర్తి సురేష్ కరీం బైక్స్‌పై షికారు చేస్తూ కనిపించారు.
దుబాయ్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతోందని తెలుస్తుంది. సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్ర బృందం.