Shruthi Haasan : సౌత్, నార్త్ సినిమాలు అని విడదీసి చూడటం కరెక్ట్ కాదు..

శృతి హాసన్ మాట్లాడుతూ.. మా నాన్న ఆల్రెడీ అన్ని భాషల్లో సినిమాలు చేశాడు. మా ఇంట్లోనే పాన్ ఇండియా ఉంటుంది. మా ఇంట్లో ఫుడ్ కూడా పాన్ ఇండియా ఫుడ్, అటు సౌత్, ఇటు నార్త్ ఫుడ్ రెండూ ఉంటాయి. మా ఇంట్లో.................

Shruthi Haasan :  సౌత్, నార్త్ సినిమాలు అని విడదీసి చూడటం కరెక్ట్ కాదు..

Shruthi Haasan comments on south and north movies

Updated On : January 11, 2023 / 10:17 AM IST

Shruthi Haasan :  హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చినా క్రాక్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ వరుసగా సినిమాలు ఓకే చేస్తుంది. ఇక సీనియర్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ అవుతుంది శృతి. ప్రస్తుతం శృతి నటించిన బాలయ్య వీరసింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధిస్తాయని ఫుల్ హోప్ తో ఉంది ఈ భామ. మరో పక్క ప్రభాస్ సలార్ సినిమాతో కూడా బిజీగా ఉంది.

ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో శృతి హాసన్ వస్తుండటంతో గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ సౌత్, నార్త్ సినిమాలపై కామెంట్స్ చేసింది.

RRR gets Golden Globe Award : కీరవాణికి వెల్లువెత్తుతున్న అభినందనలు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై కీరవాణి ఏం మాట్లాడాడో తెలుసా??

శృతి హాసన్ మాట్లాడుతూ.. మా నాన్న ఆల్రెడీ అన్ని భాషల్లో సినిమాలు చేశాడు. మా ఇంట్లోనే పాన్ ఇండియా ఉంటుంది. మా ఇంట్లో ఫుడ్ కూడా పాన్ ఇండియా ఫుడ్, అటు సౌత్, ఇటు నార్త్ ఫుడ్ రెండూ ఉంటాయి. మా ఇంట్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్.. ఇలా అన్ని భాషలు వినిపిస్తాయి. మా నాన్న మాకు ఒకటే చెప్తారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని ఇలా విడదీసి చూడకండి. అంతా ఒకటే ఇండియన్ సినిమా. ఆ తర్వాతే కావాలంటే భాష గురించి మాట్లాడండి అంటారు. ఇలా సౌత్, నార్త్ విడదీసి చూడాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడిప్పుడే సౌత్, నార్త్ కలిసి పని చేస్తున్నాయి, చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది అని తెలిపింది. దీంతో శృతి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.