Shruti Haasan : రిలీజ్‌కి ముందే ఇంటర్నేషనల్ అవార్డుల నామినేషన్‌లో శృతిహాసన్ మూవీ..

శృతిహాసన్ నటించిన సినిమా రిలీజ్ కాకుండానే ఇంటర్నేషనల్ అవార్డుల నామినేషన్‌ల్లో స్థానం దక్కించుకుంది.

Shruti Haasan : రిలీజ్‌కి ముందే ఇంటర్నేషనల్ అవార్డుల నామినేషన్‌లో శృతిహాసన్ మూవీ..

Shruti Haasan The Eye movie nominated for international awards

Updated On : October 1, 2023 / 7:58 PM IST

Shruti Haasan : సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో నటిస్తుంది. అలాగే నాని ‘హాయ్ నాన్న’ మూవీలో కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాలు కాకుండా ఒక ఇంగ్లీష్ మూవీలో కూడా నటిస్తుంది. ‘ది ఐ’ (The Eye) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ మూవీ లవ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. హాలీవుడ్ నటుడు ‘మార్క్ రౌలే’ ఈ సినిమాలో శృతిహాసన్ కి జోడిగా నటిస్తున్నాడు. ఇంకా ప్రొడక్షన్ లోనే ఉన్న ఈ మూవీ తాజాగా పలు ఇంటర్నేషనల్ అవార్డుల్లో స్థానం దక్కించుకుంది.

Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ అంటూ అక్టోబర్‌లోనే పలకరించబోతున్నాడా.. పోస్ట్ వైరల్..!

గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిలిం స్క్రీనింగ్స్ లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ అయ్యింది. అలాగే లండన్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని శృతిహాసన్ తెలియజేస్తూ ఒక పోస్ట్ వేసింది. ఈ మూవీ తనకెంతో స్పెషల్, ఆ చిత్ర యూనిట్ తో పని చేయడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Allu Business Park : అల్లు బిజినెస్ పార్క్ లాంచ్.. ముని మనవడితో రామలింగయ్య విగ్రహావిష్కరణ..

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

ఇక సలార్ విషయానికి వస్తే.. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ని కూడా శృతిహాసన్ పూర్తి చేసేసింది. ఈ సినిమాలో ఆద్య అనే పాత్రలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలే నెలకొన్నాయి. కేజీఎఫ్ తో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. శృతిహాసన్ ఆల్రెడీ ఈ ఏడాది రెండు హిట్స్ ని అందుకుంది. మరి సలార్ తో హ్యాట్రిక్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.