Shyam Singha Roy : ఓపెనింగ్ అదిరింది.. ఫ్యాన్సీ రేటుకి హిందీ రైట్స్..
నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ హిందీ రైట్స్ కోసం ఎంత పెట్టారంటే..

Shyam Singha Roy
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో, వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
Akhanda Pre Release Event : ‘అఖండ’ ఫంక్షన్‌కి అతిథిగా నాని..
ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘శ్యామ్ సింగ రాయ్’ తల్లి తెలుగు, తండ్రి బెంగాలీ వ్యక్తి అని టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పి సినిమా మీద హైప్ మరింత పెంచారు నాని. ఆయన రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సాయి పల్లవి రోల్ కూడా సాలిడ్‌గా ఉండబోతోందని హింట్ ఇచ్చారు మేకర్స్.
Shyam Singha Roy: అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే “శ్యామ్ సింగ రాయ్”.. టీజర్ వచ్చేసింది
‘శ్యామ్ సింగ రాయ్’ నాని కెరీర్‌లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గా హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడుపోయాయి. బీ 4 ఛానెల్ రూ. 10 కోట్లకు ‘శ్యామ్ సింగ రాయ్’ హిందీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 24న తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
25th Nov?#EdoEdo ?
Second Single pic.twitter.com/1OZoUNeeKW— Nani (@NameisNani) November 22, 2021