Shyam Singha Roy: అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే “శ్యామ్‌ సింగ‌ రాయ్”.. టీజర్ వచ్చేసింది

నేచుర‌ల్‌స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగ‌రాయ్ విడుదలకు సిద్ధం అయ్యింది.

Shyam Singha Roy: అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే “శ్యామ్‌ సింగ‌ రాయ్”.. టీజర్ వచ్చేసింది

Nani Sam

Shyam Singha Roy: నేచుర‌ల్‌స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగ‌రాయ్ విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా టీజర్ విడుదలైంది. అడిగే అండ లేదు.. కలబడే కండలేదని అంటూ సాగే డైలాగ్‌తో సినిమా స్టార్ట్ అవ్వగా.. శ్యామ్‌సింగరాయ్ టీజర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుండగా.. లేటెస్ట్‌గా రిలీజైన సినిమా టీజర్ ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తుంది.

ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియ‌న్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే విధంగా ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా చిత్రయూనిట్ చెబుతుంది. ఇంతకుముందు ట్యాక్సీవాలా అనే సినిమాను కూడా రాహుల్ తెరకెక్కించారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం, జీస్సూసేన్‌ గుప్తా, లీలా స్యామ్‌స‌న్‌, మ‌ణీశ్ వ‌డ్వ‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో చేస్తున్నారు. సత్యదేవ్ జంగా ఈ సినిమాకు కథ అందించగా.. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. శాను జాన్ వ‌ర్గీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.