Siddharth : బిగ్‌బాస్ హౌస్‌లోకి హీరో సిద్దార్థ్.. ఏదో జరుగుతుంది అంటున్న ఆడియన్స్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి హీరో సిద్దార్థ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే నాగార్జున షేర్ చేసిన వీడియో చూసిన ఆడియన్స్ ఏదో జరుగుతుంది అంటూ..

Siddharth : బిగ్‌బాస్ హౌస్‌లోకి హీరో సిద్దార్థ్.. ఏదో జరుగుతుంది అంటున్న ఆడియన్స్..

Siddharth special entry in Nagarjuna Telugu Bigg Boss 7

Siddharth – Bigg Boss 7 : బిగ్‌బాస్ సీజన్ 7లో ప్రస్తుతం ఆరో వారం నడుస్తుంది. ఈ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీలు, సీక్రెట్ రూమ్ నుంచి గౌతమ్ హౌస్ లోకి రావడం.. ఇలా ఆసక్తికరంగా షో సాగుతూ ముందుకు వెళ్తుంది. అయితే ఈ ఎంట్రీలతో ఈ వారం కంప్లీట్ అవ్వడం లేదు. ఇంకా ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ హౌస్ లోకి హీరో సిద్దార్థ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఒక వీడియో షేర్ చేసి మరి రిలీజ్ చేశాడు. ఈ వీడియోని కూడా పూర్తి గా షేర్ చేయలేదు. ఇంకా ఉందంటూ ముగించేశారు.

కాగా బిగ్‌బాస్ కి సంబంధించిన ప్రోమోలు అన్ని.. షో నిర్వాహకులు ద్వారా సంబంధిత ఛానల్ అకౌంట్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వస్తాయి. ఏ స్పెషల్ గెస్ట్ వచ్చినా.. దాని ప్రోమో ఛానల్ అకౌంట్స్ నుంచి రావాల్సిందే. కానీ కొత్తగా నాగార్జున సిద్దార్థ్ కి సంబంధించిన వీడియోని షేర్ చేయడం, ఇంకా ఉందంటూ సగం వీడియోనే షేర్ చేయడం.. కొంచెం సందేహం కలిగిస్తుంది. దీంతో ‘ఏదో జరుగుతుంది అంటూ’ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగార్జున ఎలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

Also read : Ira Khan : కాబోయే భర్తతో కలిసి స్టార్ హీరో కూతురు జిమ్ వర్క్ ఔట్స్.. ముద్దు ఎక్స్‌సైజ్ చూశారా..?

సిద్దార్థ్ రీసెంట్ గా ‘చిన్నా’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే సిద్దార్థ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి హౌస్ లో సిద్దార్థ్ ఏం చేయబోతున్నాడో తెలియాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. కాగా బిగ్‌బాస్ నుంచి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా.. ఆడవారే కావడం గమనార్హం. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.