Siddhu Jonnalagadda : హీరోయిన్స్‌తో కాదు డైరెక్టర్స్‌తో రిలేషన్‌షిప్.. ఆ డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నా.. డీజే టిల్లు!
సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్స్‌తో కాకుండా డైరెక్టర్స్‌తో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తాని. ప్రస్తుతం ఆ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Siddhu Jonnalagadda about rumours around tillu square
Siddhu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డీజే టిల్లు చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. దీంతో ఈ సీక్వెల్ పై అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక రూమర్ బయటకి వస్తూనే ఉంది. హీరో సిద్ధుకి డైరెక్టర్ మరియు హీరోయిన్ల మధ్య విబేధాలు రావడంతో ముందు అనుకున్న డైరెక్టర్ అండ్ హీరోయిన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి వాక్ అవుట్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.
Anupama Parameswaran : సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమా చూశారా?
ఇటీవల అనుపమ, సిద్దు మధ్య కూడా గొడవ జరిగినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా వీటన్నిటి పై సిద్దు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అనుపమతో గొడవ అబద్దం అని తెలిపిన సిద్దు.. ఈ సీక్వెల్ కి హీరోయిన్ గా మొదటి నుంచి అనుకున్నది అనుపమనే అని తెలియజేశాడు. ఇక డీజే టిల్లుని తెరకెక్కించిన విమల్ కృష్ణను టిల్లు స్క్వేర్ కి కూడా తీసుకున్నారు. కానీ కొన్ని కారణాలు వల్ల అతని ప్లేస్ లోకి మల్లిక్ రామ్ ఎంట్రీ ఇచ్చాడు. దీని పై కూడా అనేక వార్తలు వచ్చాయి. ఈ విషయానికి సిద్దు రియాక్ట్ అవుతూ.. లైవ్ లోనే విమల్ కృష్ణ కి ఫోన్ చేసి మాట్లాడి తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చాడు.
ఇదే ఇంటర్వ్యూలో సిద్దు మాట్లాడుతూ.. ”నేను హీరోయిన్స్‌తో కాదు డైరెక్టర్స్‌తో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తా. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ డైరెక్ట్ చేస్తున్న మల్లిక్ తో రిలేషన్ లో ఉన్నా. మల్లిక్ నాతో పాటు మా ఇంటిలోనే ఉంటున్నాడు, నాతో పాటే తింటున్నాడు. నాతో పాటే పడుకుంటున్నాడు. అతను పడుకుంటే దుప్పటి కూడా కప్పుతున్నా. నాతో కృష్ణ అండ్ హిస్ లీల తెరకెక్కించిన దర్శకుడికి అయితే నేను ముద్దు కూడా పెట్టాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.