DJ Tillu : నటీనటులందరి తరపున ఇది చెప్తున్నాను.. సిద్ధు జొన్నలగడ్డ సీరియస్ పోస్ట్..
ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ – నేహా శెట్టి జంటగా నటిస్తున్న ”డీజే టిల్లు” సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. విలేఖరులు..........

Siddhu Jonnalagadda
Siddhu Jonnalagadda : ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ – నేహా శెట్టి జంటగా నటిస్తున్న ”డీజే టిల్లు” సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. విలేఖరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ‘డీజే టిల్లు’ సినిమా ట్రైలర్ లో హీరో హీరోయిన్ ని ”ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి అని అడగగా హీరోయిన్ 16 అని” చెప్తుంది. ఈ డైలాగ్ ని ఆధారంగా తీసుకొని ఓ ప్రముఖ జర్నలిస్టు ”హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పించారు కదా.. హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో రియల్ గా తెలుసుకున్నారా?” అని హీరో సిద్ధుని ప్రశ్నించాడు. దీనికి సిద్దు ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పి వదిలేశాడు.
ఆ తర్వాత నెటిజన్లు, అభిమానులు ఆ జర్నలిస్ట్ ని ట్రోల్ చేయడం, హీరోయిన్ కూడా ఆ జర్నలిస్ట్ కి ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం, సినీ నిర్మాత కూడా దీనిపై స్పందించడం జరిగాయి. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ కూడా కావాలని అనలేదు. క్షమాపణలు వేడుకుంటున్నాను అని కూడా పోస్ట్ చేశాడు. తాజాగా ఈ విషయంపై ”డీజే టిల్లు” సినిమా హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పందించాడు. దీనిపై తన సోషల్ మీడియాలో ఓ సీరియస్ పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ లో .. ”నన్ను తీవ్రంగా బాధించిన విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నాను. నా కొత్త చిత్రం ”డీజే టిల్లు” థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చాలా కించపరిచే ప్రశ్న నన్ను అడిగారు. నేను దానికి సమాధానం ఇవ్వను అని స్టేజిపై చెప్పాను. నేను అలా స్పందించడానికి కారణం ఏమిటని చాలా మంది నన్ను అడిగారు. నేను చాలా ప్రశాంతంగా మరియు కంపోజ్డ్ పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలనుకున్నాను. నేను నా కోపాన్ని బయటకి చూపించకుండా నిగ్రహంగా ఉండాలని అనుకున్నాను. నేను దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్నను గౌరవించాలని అనుకోలేదు”
Allu Arjun : ‘పుష్ప’ 50 రోజులు.. 365 కోట్ల కలెక్షన్స్.. తగ్గేదేలే..
”నటీనటుల పట్ల కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని కూడా అది తెలియజేస్తుంది. నటీనటులు ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడతారు. నిజానికి చాలా ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా మహిళలు సెట్ లో దాదాపు వంద మంది వ్యక్తుల మధ్య తమ సహనటుడిని ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక టెక్నిషియన్ వారి ముఖం వద్ద లైట్ పట్టుకుని ఉన్నప్పుడు అలా నటించడానికి చాలా ధైర్యం కావాలి. నటీనటులందరి తరపున నేను స్వేచ్ఛ తీసుకుని ఇది చెప్తున్నాను. అంత ధైర్యం ఉన్నందుకు మేము గౌరవించబడతాము. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము. మేము చేసే పనిని బట్టి మా నిజ జీవితాలని జడ్జ్ చేయబడతాయని మేం అనుకోవట్లేదు.”
Kangana Ranaut : ఆమె సినిమాని నేను ప్రమోట్ చేయను.. దీపిక సినిమాపై కంగనా వ్యాఖ్యలు
”ఇక్కడితో దీన్ని వదిలేయాలని ప్రతి ఒక్కరినీ నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే నా సినిమాని కంటెంట్ కోసం, నవ్వుల కోసం, ట్రైలర్ సృష్టించిన మ్యాడ్ నెస్ కోసం ప్రచారం చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని అలరించేందుకు, నవ్వించడానికి, ఏడిపించడానికి, భావోద్వేగాల రోలర్ కోస్టర్ లో మిమ్మల్ని తీసుకెళ్లడానికి ‘DJ టిల్లు’ త్వరలో మీ సమీపంలోని థియేటర్ లో రాబోతోంది. త్వరలో కలుద్దాం!” అని రాశాడు.
అలాగే ఈ పోస్ట్ కి యాక్టర్స్ ని గౌరవించండి అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేశాడు. సిద్ధూ పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
A humble appeal #respectactors#DJTillu pic.twitter.com/WbLF9mZ0oM
— Siddhu Jonnalagadda (@Siddu_buoy) February 4, 2022