Siddu Jonnalagadda : ఆరుగురు నేషనల్ అవార్డు విన్నెర్స్‌తో డీజే టిల్లు మూవీ.. నిజమేనా?
టిల్లు స్క్వేర్ షూటింగ్ తో బిజీ ఉన్న సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆరుగురు నేషనల్ అవార్డు విన్నెర్స్‌తో..

Siddu Jonnalagadda next with Neeraja Kona and six national award winners
Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ గత ఏడాది డీజే టిల్లుతో (DJ Tillu) అందర్నీ అలరించాడు. ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో పడ్డాడు. తాజాగా ఈ హీరో కొత్త మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆరుగురు నేషనల్ అవార్డు విన్నెర్స్‌తో కలిసి సిద్దు ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సమంత, కాజల్.. వంటి స్టార్స్ కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన నీరజ కోన (Neeraja Kona) ఇప్పుడు దర్శకురాలిగా మారబోతున్న సంగతి తెలిసిందే.
Rangabali Trailer : నాగశౌర్య ‘రంగబలి’ ట్రైలర్ రిలీజ్.. సత్య కామెడీ, నాగశౌర్య యాక్షన్ అదిరిపోయాయి!
రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ సినిమాని మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా సిద్ధుని ఒకే అయ్యినట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. కాగా ఈ చిత్ర సాంకేతిక నిపుణులు కోసం నేషనల్ అవార్డు విన్నర్స్ ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. సినిమాటోగ్రాఫర్‌గా పి సి శ్రీరామ్ (P C Sreeram), సంగీత దర్శకుడిగా థమన్ (Thaman), ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా శర్మిష్ట రాయ్, కొరియోగ్రాఫర్‌గా బృంద మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అర్చన రావుని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్యాస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండానే మూవీ పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక టిల్లు స్క్వేర్ (Tillu Square) విషయానికి వస్తే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.