Naatu Naatu Song : థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. 10టీవీతో రాహుల్ సిప్లిగంజ్..

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘నాటు నాటు’ సాంగ్..

Naatu Naatu Song : థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. 10టీవీతో రాహుల్ సిప్లిగంజ్..

Rahul Sipligunj

Updated On : November 11, 2021 / 12:09 PM IST

Naatu Naatu Song: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ‘నాటు నాటు’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. ఇద్దరు హీరోలూ బెస్ట్ డ్యాన్సర్స్ అనే సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ కలిసి ఒక పాటలో స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది.. ‘నాటు నాటు’ పాటలా ఉంటుంది..

Naatu Naatu Song : గట్టు మీద గడ్డపారలు! ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా ఎన్టీఆర్ – చరణ్ డ్యాన్స్ !

బుధవారం ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. స్వరవాణి కీరవాణి ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. చంద్రబోస్ అదిరిపోయే లిరిక్స్ రాశారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న కాలభైరవ, యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్‌ ఇద్దరూ కలిసి చాలా చక్కగా, ఎనర్జిటిక్‌గా పాడారు.

Naatu Naatu Song : దుమ్ములేపి దమ్ము చూపిన డాన్సర్లు.. చెర్రీ, NTR ఫ్యాన్స్‌కు అసలైన దీపావళి

ఈ పాట పాడడం పట్ల తన హ్యాపీనె‌స్‌ని రాహుల్ సిప్లిగంజ్ 10టీవీతో షేర్ చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లో ‘నాటు నాటు’ సాంగ్ తన కెరీర్‌‌లో బెస్ట్ సాంగ్‌గా నిలిచిపోతుందని.. పాట చూస్తున్నంత సేపు ముఖం మీద స్మైల్ అలా ఉండిపోతుందని.. విజువల్‌గా చూసేటప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోతాయని.. తనకు ఈ పాట పాడే అవకాశాన్నిచ్చిన కీరవాణి, రాజమౌళికి థ్యాంక్స్ చెప్పారు రాహుల్. 10టీవీ ప్రేక్షకుల కోసం పాటలోని రెండు లైన్స్ పాడి వినిపించారు.