Love Your Father : ‘లవ్ యువర్ ఫాదర్'(LYF) అంటున్న సింగర్ SP చరణ్.. దైవత్వంతో తండ్రి కొడుకుల కథ..

సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Love Your Father : ‘లవ్ యువర్ ఫాదర్'(LYF) అంటున్న సింగర్ SP చరణ్.. దైవత్వంతో తండ్రి కొడుకుల కథ..

Singer SP Charan Movie Love Your Father Shooting Completed

Updated On : September 25, 2024 / 7:09 AM IST

Love Your Father : దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా తెరకెక్కుతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకొని మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం కథే ఈ సినిమా. ఈ కథ అంతా కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమాలో శివతత్వాన్ని కూడా చూపించాం. హీరో తండ్రి పాత్రలో SP చరణ్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అని తెలిపారు.

Also Read : Nagababu – Pawan Kalyan : కళ్యాణ్ బాబు చాలా కాలం కింద నాకు ఒక మాట చెప్పాడు.. నాగబాబు ఆసక్తికర పోస్ట్..

నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఇప్పుడు పూర్తిచేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో ఎక్కువ భాగం కాశీలోనే షూట్ చేసాం. ఈ సినిమాలో దైవత్వంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపించబోతున్నాం. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అని తెలిపారు.

Singer SP Charan Movie Love Your Father Shooting Completed