SP Charan : సింగర్ SP చరణ్ రీ ఎంట్రీ సినిమా ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్).. రిలీజ్ డేట్ అనౌన్స్..

'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు SP చరణ్.

SP Charan : సింగర్ SP చరణ్ రీ ఎంట్రీ సినిమా ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్).. రిలీజ్ డేట్ అనౌన్స్..

Singer SP Charan Re Entry Movie LYF Love Your Father Release Date Announced

Updated On : March 17, 2025 / 4:14 PM IST

SP Charan : దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ గతంలో నటుడిగా కూడా పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించాడు. మళ్ళీ చాన్నాళ్ల తర్వాత SP చరణ్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు SP చరణ్. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ సినిమా తెరకెక్కుతుంది.

శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా లైఫ్ సినిమా పూర్తయి ఫస్ట్ కాపీ రావడంతో మణిశర్మ కూడా సినిమా చూసి మూవీ టీమ్ ని అభినందించారు. అలాగే సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా రావడంతో మూవీ యూనిట్ మణిశర్మని సత్కరించారు. సినిమా రిలీజ్ డేట్ ని కూడా తాజాగా ప్రకటించారు.

Also Read : Mahesh Babu Foundation : ఏపీలో మొట్టమొదటి అమ్మ పాల బ్యాంక్ స్థాపించిన మహేష్ బాబు.. ఓపెనింగ్ లో మహేష్ భార్య సందడి..

ఈ సందర్భంగా మీడియాతో డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం కథ మీద ఈ సినిమా ఉండనుంది. కథ అంతా కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమాలో శివతత్వాన్ని కూడా చూపించాం. తండ్రి పాత్రలో SP చరణ్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్స్ లో రిలీజ్ కానుంది అని తెలిపారు.

Singer SP Charan Re Entry Movie LYF Love Your Father Release Date Announced

నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ.. సినిమాలో ఎక్కువ భాగం కాశీలోనే షూట్ చేసాం. ఈ సినిమాలో దైవత్వంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా బాగా చూపించబోతున్నాం. ఫస్ట్ కాపీ చూశాక సినిమాపై మా నమ్మకం ఇంకా పెరిగింది. వెంటనే మణి శర్మ గారిని సత్కరించాం. ఈ సినిమాను ఏప్రిల్ 4న రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతాం అని తెలిపారు.

Also Read : Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు చూశారా? కాస్త సన్నబడినట్టు ఉన్నాడే.. ప్రశాంత్ నీల్ సినిమా లుక్ ఇదేనా?