Siri hanumanthu : నాకు, శ్రీహాన్ కి నిజంగానే బ్రేకప్ అయింది.. కానీ..

శ్రీహన్ తో తన బ్రేకప్ రూమర్స్ గురించి సిరి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. సిరి హనుమంత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ నుంచి నేను బయటకి వచ్చాక మా ఇద్దరి మధ్య చాలా గొడవలయ్యాయి. కలవడం, మాట్లాడటం మానేశాం..........

Siri hanumanthu : నాకు, శ్రీహాన్ కి నిజంగానే బ్రేకప్ అయింది.. కానీ..

Siri hanumanthu spoke about her breakup rumors with srihan

Updated On : December 10, 2022 / 8:56 AM IST

Siri hanumanthu :  యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ గత సీజన్ లో బిగ్‌బాస్‌ లో పాల్గొంది, ఈ సీజన్ లో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ పాల్గొంటున్నాడు. తాజాగా బిగ్‌బాస్‌ కి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో సిరి రాగా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. గత సీజన్ లో సిరి షణ్ముఖ్ కి దగ్గరవ్వడంతో అటు షణ్ముఖ్, దీప్తి విడిపోయారు. సిరి, శ్రీహన్ కూడా విడిపోయారు అని రూమర్స్ బాగానే వినిపించాయి. బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక కొన్ని రోజుల దాకా సిరి, శ్రీహన్ కలిసి కనిపించలేదు. తర్వాత మళ్ళీ కలిసి మేము కలిసే ఉన్నాం అంటూ ఇండైరెక్ట్ గా చెప్పారు.

అయితే శ్రీహన్ తో తన బ్రేకప్ రూమర్స్ గురించి సిరి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. సిరి హనుమంత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ నుంచి నేను బయటకి వచ్చాక మా ఇద్దరి మధ్య చాలా గొడవలయ్యాయి. కలవడం, మాట్లాడటం మానేశాం. ఆల్మోస్ట్ విడిపోయాం. శ్రీహన్ నుంచి దూరమయ్యాక నాకు కోవిడ్ వచ్చింది. చాలా రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఉంచాను. రోడ్ మీద పిచ్చిదానిలా తిరిగాను. కొన్ని రోజుల తర్వాత శ్రీహన్ కాల్స్, మెసేజ్ లు చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంక లైఫ్ లో ఎప్పటికీ కనిపించను అని మెసేజ్ పెట్టాడు. వెంటనే కాల్ చేశా. అప్పుడు రోడ్ మీద నడుస్తూ ఉన్నా, వచ్చి తీసుకెళ్లాడు. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ క్లోజ్ అయ్యాం” అని తెలిపింది.

Aamir Khan : మాజీ భార్యతో కలిసి పూజలు.. అమీర్‌ఖాన్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

అలాగే వీరిద్దరూ ఇప్పటికే ఒక బాబుని దత్తత తీసుకున్నారు. త్వరలోనే ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తెలిపింది సిరి. ఇక శ్రీహన్ బిగ్‌బాస్‌ లో గెలవడానికి బయట నుంచి సిరి గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది.