Sivaji – Laya : సూపర్ హిట్ కాంబో మళ్ళీ వచ్చేస్తుంది.. శివాజీ – లయ జంటగా కొత్త సినిమా..

ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శివాజీ - లయ ఇప్పుడు మళ్ళీ కలిసి నటించబోతున్నారు.

Sivaji – Laya : సూపర్ హిట్ కాంబో మళ్ళీ వచ్చేస్తుంది.. శివాజీ – లయ జంటగా కొత్త సినిమా..

Sivaji and Laya Re Union for New Movie after so Many Years

Updated On : August 18, 2024 / 7:31 PM IST

Sivaji – Laya : గతంలో శివాజీ – లయ కలిసి చేసిన ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘అదిరిందయ్యా చంద్రం’.. సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ ఇద్దరు కూడా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివాజీ ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది.

Also Read : Revu : ‘రేవు’ ట్రైలర్ రిలీజ్.. ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తా అన్న దిల్ రాజు..

ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శివాజీ – లయ ఇప్పుడు మళ్ళీ కలిసి నటించబోతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ లయ జంటగా కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి శివాజీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్ చేసారు.

Sivaji and Laya Re Union for New Movie after so Many Years

ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 20 నుంచి మొదలు కానుంది. ఒకప్పటి సూపర్ హిట్ పెయిర్ శివాజీ – లయ మళ్ళీ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.