Sivaji : బిగ్‌బాస్ ఓటమి గురించి శివాజీ వీడియో పోస్ట్.. నన్ను షో మేనేజ్మెంట్..

బిగ్‌బాస్ షో మేనేజ్మెంట్ నన్ను తప్పించి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ వీడియో పోస్ట్ వైరల్.

Sivaji : బిగ్‌బాస్ ఓటమి గురించి శివాజీ వీడియో పోస్ట్.. నన్ను షో మేనేజ్మెంట్..

Sivaji comments about biggboss management and winner announcement

Updated On : December 19, 2023 / 9:18 AM IST

Sivaji : బిగ్‌బాస్ సీజన్ 7 పూర్తి అయ్యిపోయింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని చేసుకున్నాడు. అయితే అందరూ శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని అనుకున్నారు. కానీ శివాజీని కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ విషయం పై పలువురు మోసం జరిగిందంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ పై శివాజీ స్పందిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తనని ఆదరించిన ప్రేక్షకులను, తనకి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున, బిగ్‌బాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక ఇదే వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. “బిగ్‌బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. నేను వాటిని నమ్మను కూడా. బిగ్‌బాస్ వారు ఓటింగ్ ఫార్మాట్ తోనే విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. అలాగే ప్రశాంత్ ని విజేతగా ప్రకటించారు. అందుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. షో స్టార్టింగ్ లో తను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను. ఇలాంటి ఒక కామన్ టైటిల్ సాధిస్తే చాలా బాగుటుంది అనుకున్నాను. ఎందుకంటే నేను అలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే. యావర్ కూడా ఒక కామన్ మ్యాన్ గానే వచ్చాడు. అందుకే మాకు స్నేహం కుదిరింది. అంతేతప్ప గేమ్ ప్లాన్స్ ఏం లేవు” అని చెప్పుకొచ్చారు.

Also read : Salaar : సలార్ క్రేజ్ మాములుగా లేదుగా.. టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఇది గమనించారా..?

అలాగే తనకి మద్దతు తెలిపిన ప్రేక్షకులను త్వరలోనే కలుసుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే, విజేతగా నిలిచిన ప్రశాంత్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సహంతో అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ కారుల పై దాడికి పాల్పడి అల్లరి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థులను కూడా నాశనం చేయడంతో పోలీసులు.. పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : Prashanth Neel : నాకు ఆ సమస్య ఉంది.. అందుకే నా సినిమాలన్నీ డార్క్ గా ఉంటాయి..