మా ఎన్నికలు : ఇండస్ట్రీ వదిలేస్తున్నా అంటూ శివాజీరాజా ప్రకటన

మా ఎన్నికలు : ఇండస్ట్రీ వదిలేస్తున్నా అంటూ శివాజీరాజా ప్రకటన

హీరో శివాజీ రాజా.. మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాంత్‌,  నేను ఏ తప్పూ చేయలేదని విలపించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  (మా) ఎన్నికలు రసవత్తరంగా మారిన వేళ ఇండస్టీనే వదిలేసి వెళ్లిపోతున్నానంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 10న జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనేదే లేదని స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీని వదిలి అరుణాచలం వెళ్లిపోతానంటూ కన్నీటి పర్యంతమైయ్యాడు. సోదరుడిగా భావించిన నరేశ్ ఇలా మోసం చేస్తాడనుకోలేదని విమర్శించారు. తనకు ఎప్పుడూ కంటతడి పెట్టుకోవడం ఇష్టం ఉండదని, తన వల్ల శ్రీకాంత్‌కు చెడ్డ పేరు వస్తుందనే బాధలో కన్నీరు ఆగడం లేదని తెలిపాడు. 
Also Read : సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు

తమ ప్యానెల్‌తో కలిసి మార్చి 8వ తేదీ శుక్రవారం మీడియా ముందుకు వచ్చాడు శివాజీ రాజా. నిజాలు తెలుసుకోకుండా జీవిత రాజశేఖర్‌ తమపై తప్పుడు ఆరోపణలు చేయటాన్ని ఖండించారు. నరేశ్ దారుణంగా మోసం చేశాడని.. అతనొక మూర్ఖుడు, శాడిస్ట్ అంటూ విరుచుకుపడ్డారు. 

నా మీద అభిమానులు చూపించిన ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటాను.. ఇకపై నేను మా ఎన్నికల్లో పోటీ చేయను అని వెల్లడించారాయన. ఈ ప్రెస్‌మీట్ పెట్టడం కూడా నాకిష్టం లేదు.. కానీ, తప్పుడు సమాచారంతో టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చి మా పరువు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సినీ నటుడు. మేం మాట్లాడకుండా ఉంటే అవే నిజమనుకుంటారు.. అందుకే ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని వివరించారు శివాజీరాజా. మా ప్రెసిడెంట్‌కు పోటీ చేయాలని స్వతహాగా అనుకోలేదు. పద్మ అనే ఆర్టిస్ట్ పోటీ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని అంది.. మరికొందరు పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టడంతో పోటీ చేశాను అని వివరించారు.

ఇకపై ఇండస్ట్రీకి సెలవు. మా కుటుంబమంతా అరుణాచలం వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. శ్రీకాంత్, నేను ప్రాణం పోయినా తప్పు చేయం. ఇకపై పెన్షన్లు 7500 పెంచడంతో పాటు షూటింగ్ ఉన్నా లేకున్నా.. 6 నెలలు వాళ్లకు తినడానికి అన్ని సరుకులు ఇస్తాం. నేను అరుణాచలం వెళ్లిపోయినా పేదవాడికి అందుబాటులో ఉంటా’ అంటూ కన్నీటితోనే సమావేశాన్ని ముగించారు. 
Also Read : బిగ్ డెసిషన్ : ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ సీజ్