సొంతంగా ఆలోచించే ప్రతీ ఒక్కడూ సూపర్ ‘హీరో’నే..

తమిళ యువహీరో శివ కార్తికేయన్ నటించిన ‘హీరో’ తెలుగులో ‘శక్తి’ పేరుతో విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : March 9, 2020 / 07:00 AM IST
సొంతంగా ఆలోచించే ప్రతీ ఒక్కడూ సూపర్ ‘హీరో’నే..

Updated On : March 9, 2020 / 7:00 AM IST

తమిళ యువహీరో శివ కార్తికేయన్ నటించిన ‘హీరో’ తెలుగులో ‘శక్తి’ పేరుతో విడుదల కానుంది..

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. ఈ సినిమా తెలుగులో ‘శక్తి’ (The Super Hero) పేరుతో విడుదల కానుంది.‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటించారు.(నిర్మాత సి.వెంకట్రాజు కన్నుమూత)

తాజాగా ‘శక్తి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ హీరో కావాలని కలలు కనే శక్తిగా శివ కార్తికేయన్ కనిపించాడు. అర్జున్, అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. విద్యతో వ్యాపారం, నకిలీ సర్టిఫికెట్ల దందా తదితర అంశాలు ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ ఈ చిత్రాన్ని కూడా మంచి మెసేజ్‌తో రూపొందించారని అర్థమవుతోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. మార్చి 20న ‘హీరో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.