Smriti Irani : 25 ఏళ్ళ క్రితం 1800.. ఇప్పుడు ఏకంగా 14 లక్షలు.. జస్ట్ ఒక్క ఎపిసోడ్ కి.. మాజీ కేంద్ర మంత్రి రెమ్యునరేషన్..?

ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత స్మృతి ఇరానీ మళ్ళీ సీరియల్స్ లో ఎంట్రీ ఇస్తుంది.

Smriti Irani : 25 ఏళ్ళ క్రితం 1800.. ఇప్పుడు ఏకంగా 14 లక్షలు.. జస్ట్ ఒక్క ఎపిసోడ్ కి.. మాజీ కేంద్ర మంత్రి రెమ్యునరేషన్..?

Smriti Irani

Updated On : July 9, 2025 / 5:47 PM IST

Smriti Irani : మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకప్పుడు టీవీ నటి అని తెలిసిందే. బాలీవుడ్ లో అనేక సీరియల్స్ లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. పలు సినిమాల్లో కూడా నటించింది. అనంతరం సినిమాలు, సీరియల్స్ నుంచి దూరమయి రాజకీయాల్లో ఎదిగి కేంద్రమంత్రి అయింది.

ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత స్మృతి ఇరానీ మళ్ళీ సీరియల్స్ లో ఎంట్రీ ఇస్తుంది. ఒకప్పటి సూపర్ హిట్ బాలీవుడ్ సీరియల్ ‘క్యూన్కి సాస్ బి కభీ బహు తీ’ కి సీక్వెల్ రాబోతుంది. ఈ సీరియల్ లో గతంలో స్మృతి ఇరానీ మెయిన్ లీడ్ తులసి పాత్ర పోషించింది. ఇప్పుడు రాబోయే సీక్వెల్ లో మళ్ళీ అదే తులసి పాత్రతో బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది స్మృతి ఇరానీ.

Also Read : Anil Geela : హీరోగా మారిన తెలంగాణ యూట్యూబర్.. వెబ్ సిరీస్ తో.. స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడు?

ప్రస్తుతం ఈ సీరియల్ షూటింగ్ దశలో ఉన్నట్టు సమాచారం. ఈ సీరియల్ నుంచి ఇటీవల స్మృతి ఇరానీ ఫస్ట్ లుక్ లీక్ అయింది. గతంలో ఈ సీరియల్ కథ తన చుట్టే నడిచింది. ఇప్పుడు కూడా తన చుట్టూనే కథ నడుస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సీరియల్ కి స్మృతి ఇరానీ తీసుకునే రెమ్యునరేషన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. స్మృతి ఇరానీ 2000 సంవత్సరంలో ఇదే సీరియల్ చేసినప్పుడు అప్పుడు ఎపిసోడ్ కి 1800 రెమ్యునరేషన్ తీసుకునేది.

తాజాగా బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఇప్పుడు సీరియల్ లో ఒక్క ఎపిసోడ్ కి స్మృతి ఇరానీ ఏకంగా 14 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే సీరియల్ లో ఒక్క ఎపిసోడ్ కి మరీ ఇంత ఎక్కువ ఇస్తారా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై స్మృతి ఇరానీ కానీ, సీరియల్ యూనిట్ కానీ స్పందిస్తారా చూడాలి.

Also Read : Ali : ఒక అమ్మాయి నో చెప్పిందని నా మేనల్లుడు చనిపోయాడు.. అలీ ఎమోషనల్ కామెంట్స్..

సాధారణంగా తెలుగు సీరియల్స్ లో మెయిన్ లీడ్స్ నటించే వాళ్లకు ఎపిసోడ్ కి 30 వేల నుంచి ఇస్తారు. మ్యాగ్జిమమ్ లక్ష రూపాయల వరకు కూడా ఇస్తారు. ఎంత బాలీవుడ్ అయినా, ఎంత మాజీ కేంద్రమంత్రి అయినా, ఎంత స్టార్ డమ్ ఉన్నా మూడు, నాలుగు లక్షల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఒక్క ఎపిసోడ్ కి ఇస్తారా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.