Anil Geela : హీరోగా మారిన తెలంగాణ యూట్యూబర్.. వెబ్ సిరీస్ తో.. స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడు?

నేడు ఈ సిరీస్ ప్రకటించి టైటిల్, ఫస్ట్ లుక్ ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

Anil Geela : హీరోగా మారిన తెలంగాణ యూట్యూబర్.. వెబ్ సిరీస్ తో.. స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడు?

Mothevari Love Story

Updated On : July 9, 2025 / 4:55 PM IST

Anil Geela : మై విలేజ్ షోతో పాటు పలు యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న అనిల్ జీలా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు, సిరీస్ లలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’. తెలంగాణ విలేజ్ కామెడీ, లవ్ జానర్లో మై విలేజ్ షో, మధుర శ్రీధర్ నిర్మాణంలో శివ కృష్ణ బుర్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నేడు ఈ సిరీస్ ప్రకటించి టైటిల్, ఫస్ట్ లుక్ ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

Anil Geela

లంబాడిపల్లి అనే గ్రామంలో ఇద్దరు సోదరులు, ఓ లవ్ స్టోరీ, వారి పెళ్లి చుట్టూ ఈ సిరీస్ కామెడీ థ్రిల్లర్ గా సాగనుందని సమాచారం. ఈ సిరీస్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే టైటిల్, పోస్టర్ కొత్తగా ఉంది. నాకు ఇలా ఈవెంట్లకు రావడం కాస్త భయం. కానీ అనిల్ పిలిచిన వెంటనే రావాలని అనిపించింది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్‌ను చూసేవాళ్లు. నేను కూడా ఫాలో అయ్యేవాడ్ని. దొరసాని సినిమాకు మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. ఈ సిరీస్‌కు సీక్వెల్స్ వస్తూనే ఉండాలి అని అన్నారు.

Also Read : Tollywood : అమెరికాలో క్రికెట్ కప్ గెలిచిన టాలీవుడ్ స్టార్స్.. వెంకీమామతో ఫొటో వైరల్..

జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ.. కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమా నచ్చి వెంటనే ఆ మూవీ రైట్స్‌ను మేం కొనేశాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో సంగీత్ శోభన్‌కు స్టార్ డమ్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌తో అనిల్ గీలాకు స్టార్ డమ్ వస్తుంది అని తెలిపారు. అనిల్ జీలా మాట్లాడుతూ.. మా మై విలేజ్ షో టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఈ సిరీస్ చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం. నన్ను విజయ్ దేవరకొండ అన్ననే సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థ్యాంక్స్ అని తెలిపాడు.

Anil Geela

డైరెక్టర్ శివ కృష్ణ మాట్లాడుతూ.. మేం ప్రొడక్షన్ సైడ్ రావడం ఇదే మొదటి సారి. మాకు మధుర శ్రీధర్ గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మై విలేజ్ షో ఫౌండర్ శ్రీరామ్ శ్రీకాంత్‌కి థ్యాంక్స్. మేం అంతా ఎక్కడెక్కడి వాళ్లమో ఇలా కలిశాం అని అన్నారు. శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మై విలేజ్ షోలో హై క్వాలిటీ కంటెంట్ చేయాలని చాలా ప్రయత్నించాం. యూట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు తీశాం. ఇక సిరీస్‌లు, సినిమాలు చేయాలని అనుకున్నాం. మీకు నచ్చినట్టుగా తీయండి అని జీ5, మధుర శ్రీధర్ గారు అవకాశం ఇచ్చారు. ఇది మా మొదటి ప్రయత్నం. అనిల్ జీలా ఈ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పని చేశాడు. టీం అంతా కష్టపడి ఈ సిరీస్‌ను నిర్మించాం అని అన్నారు.

Also Read : Ali : ఒక అమ్మాయి నో చెప్పిందని నా మేనల్లుడు చనిపోయాడు.. అలీ ఎమోషనల్ కామెంట్స్..

నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. నేను అనిల్‌కి ఓ మూవీ చేద్దామని ఇన్ స్టాలో మెసెజ్ పెట్టాను. మనోడ్ని హీరో చేయాలని చాలా ప్రయత్నించాను. ఆ టైంలో ఈ స్క్రిప్ట్‌ని అనిల్, శివ కృష్ణ తీసుకు వచ్చారు. నమ్మకంతో, నిజాయితీతో సిరీస్ చేస్తే ఎలా ఉంటుందో ‘మోతేవారి లవ్ స్టోరీ’ అలా ఉంటుంది. తెలంగాణ మూలాల్లోంచి తీసిన మొదటి సిరీస్ ఇదే అని తెలిపారు.