Parakamani : సోషియో ఫాంటసీ సినిమా ‘పరకామణి’.. ఏడు లోకాలను చూపిస్తూ..

సుమన్ బాబు దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది. సోషియో ఫాంటసీ జానర్లో ఆ సినిమా ఉండబోతుంది.

Parakamani : సోషియో ఫాంటసీ సినిమా ‘పరకామణి’.. ఏడు లోకాలను చూపిస్తూ..

Social Fantasy Film Parakamani announced under suman babu Direction

Updated On : November 16, 2024 / 3:22 PM IST

Parakamani : త్వరలో రిలీజ్ కానున్న ‘ఎర్రచీర’ సినిమా దర్శకుడు CH సుమన్ బాబు దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది. సోషియో ఫాంటసీ జానర్లో ఆ సినిమా ఉండబోతుంది. తాజాగా ఆ సినిమా టైటిల్ ప్రకటించారు. ఈ కొత్త సినిమాకు ‘పరకామణి’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

Also Read : Actress Shazahn padamsee : ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్‌

ఈ సినిమా గురించి డైరెక్టర్ CH సుమన్ బాబు మాట్లాడుతూ.. సుమారు 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాను. సృష్టిలో భూలోకం కింద ఉండే ఏడు లోకాలైన అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ, భూతల లోకాలను చూపిస్తూ అద్భుతమైన గ్రాఫిక్స్ తో సోషియో ఫాంటసీ సినిమాగా రానుంది. ఇందులో ఇద్దరు హీరోలు నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా నాగురించి మరిన్ని వివరాలు ప్రకటిస్తాం. ఎర్ర చీర సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది అని తెలిపారు.