‘జీవితం ఓ సైకిల్‌ లాంటిది’.. మీర్జాపూర్ విద్యార్థినులకు సైకిళ్లు గిఫ్ట్ ఇచ్చిన సోనూ సూద్!

  • Published By: sekhar ,Published On : November 1, 2020 / 06:10 PM IST
‘జీవితం ఓ సైకిల్‌ లాంటిది’.. మీర్జాపూర్ విద్యార్థినులకు సైకిళ్లు గిఫ్ట్ ఇచ్చిన సోనూ సూద్!

Updated On : November 1, 2020 / 6:33 PM IST

Sonu Sood-Mirzapur: ఆన్‌ స్క్రీన్ విలన్ సోను సూద్ లాక్‌డౌన్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ఆఫ్ స్క్రీన్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ అవసరమున్నవారికి.. కష్టమొచ్చిందని చెప్పుకున్న వారికి తనకు తోచిన విధంగా సాయమందిస్తున్నారు.



పిల్లల చదువు బాధ్యతను తీసుకోవడం, ఉద్యోగ వసతిని ఏర్పాటు చేయడం ఇలా అన్ని రకాలుగా తనకు తోచినంత మేరకు సోనూసూద్‌ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి మంచి మనసు చాటుకున్నారాయన. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ ప్రాంతానికి దగ్గర ఉన్న ఓ గ్రామంలో ఆడపిల్లలు ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకుంటున్నారు. అంత కంటే పెద్ద చదువులు చదవాలంటే వారు ఊరు దాటాల్సిందే.


మధ్యలో అటవీ ప్రాంతం ఉండటంతో తల్లిదండ్రులు ఆడపిల్లలను పెద్ద చదువులు చదివించడానికి ఆసక్తి చూపలేదు. విషయం తెలుసుకున్న సోనూసూద్‌ ఊరిలోని ప్రతి ఇంటికీ ఓ సైకిల్‌ను ఇచ్చారు. ‘జీవితమనేది ఓ సైకిల్‌ లాంటిది. మైళ్ల దూరం ప్రయాణించాలి. అయితే ఇప్పుడే ఆ ప్రయాణం ప్రారంభమైంది’.. అంటూ సోనూ సూద్‌ ఫొటోతో మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు సోనూ సూద్‌ను అభినందిస్తున్నారు.