Sonu Sood : కరోనాతో జాగ్రత.. నా పాత నెంబర్ పని చేస్తుంది.. సోనూ సూద్!

దేశంలో మరోసారి విజృభిస్తున్న కోవిడ్ కేసెస్. మరో కొత్త వేరియంట్‌తో ప్రజలని భయపెడుతున్నాయి కరోనా. చైనాలో కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో, భారత్ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా కరోనా కష్ట సమయంలో అందరికి ఆపద్బాంధవుడైన సోనూ సూద్ కూడా రంగంలోకి దిగడానికి సిద్దమయ్యాడు.

Sonu Sood : కరోనాతో జాగ్రత.. నా పాత నెంబర్ పని చేస్తుంది.. సోనూ సూద్!

Sonu Sood is back for carona services

Updated On : December 24, 2022 / 12:17 PM IST

Sonu Sood : దేశంలో మరోసారి విజృభిస్తున్న కోవిడ్ కేసెస్. మరో కొత్త వేరియంట్‌తో ప్రజలని భయపెడుతున్నాయి కరోనా. చైనాలో కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో, భారత్ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. స్టేట్ గవర్నమెంట్స్ కి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర వైద్యశాఖ. ఈ నేపథ్యంలోనే విదేశాలు నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.

Sonu Sood : అరుదైన గౌరవం దక్కించుకున్న సోనూసూద్..

కాగా కరోనా కష్ట సమయంలో అందరికి ఆపద్బాంధవుడైన సోనూ సూద్ కూడా రంగంలోకి దిగడానికి సిద్దమయ్యాడు. “కరోనా మళ్ళీ తిరిగి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండండి, అసలు బయపడకండి. ఏదైనా సమస్య ఉన్నా, సహాయం కావాల్సి ఉన్నా.. నన్ను సంప్రదించండి. నా పాత నెంబర్ ఇంకా పని చేస్తూనే ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక నిష్పక్షపాతంగా సేవలు అందిస్తున్న సోనూ సూద్ ని గుర్తించిన మహారాష్ట్ర గవర్నమెంట్ ఆయనని అరుదైన అవార్డుతో సత్కరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చేతులు మీదగా ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డును సోనూ ఇటీవల అందుకున్నాడు. ఆ అవార్డు అందుకున్న సోనూ సూద్.. ‘వెనకబడిన కుటుంబాలకి ఆరోగ్యకరమైన ఒక మంచి జీవితాన్ని అందించడమే తన లక్ష్యం’ అంటూ తెలియజేశాడు.