Sonu Sood : అరుదైన గౌరవం దక్కించుకున్న సోనూసూద్..

రీల్ లైఫ్ లో విలన్ గా అందర్నీ భయపెట్టే సోనూసూద్.. రియల్ లైఫ్ లో మాత్రం అందరికి ఆపద్బాంధవుడు అవుతున్నాడు. సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు. కాగా సొసైటీ అచీవర్స్ అవార్డ్స్‌ 2022 వేడుకలు, సోమవారం రాత్రి తాజ్ శాంతాక్రూజ్‌లో జరిగిని. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సోనూసూద్ సేవా గుణాన్ని గుర్తించి అతని...

Sonu Sood : అరుదైన గౌరవం దక్కించుకున్న సోనూసూద్..

Sonu Sood Wins Prestigious ‘Nation’s Pride’ Award At Society Achievers Awards 2022

Updated On : November 22, 2022 / 12:36 PM IST

Sonu Sood : రీల్ లైఫ్ లో విలన్ గా అందర్నీ భయపెట్టే సోనూసూద్.. రియల్ లైఫ్ లో మాత్రం అందరికి ఆపద్బాంధవుడు అవుతున్నాడు. కరోనా కష్ట సమయంలో భయంతో ఉన్నవారికి తానే ధైర్యం అయ్యాడు. సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎవరు, ఎక్కడి వారు అనేది చూడకుండా అందుతున్న సోనూ సాయం చూసిన జనం అతని వద్దకు కదిలివెళుతున్నారు.

Sonu Sood: IAS చదివే వారి కోసం సోనూసూద్‌ సహాయం..

ఈ రియల్ హీరో తన సేవ కారిక్రమాలని కోవిడ్ సమయంలోనే కాదు ఆ తరువాత కూడా ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్‌’ను స్థాపించి దేశ నలుమూలలకు తన సేవలను అందిస్తున్నారు. అతని సేవ భావం చూసిన జనం అతనికి అభిమానులు అయిపోతున్నారు. కాగా సొసైటీ అచీవర్స్ అవార్డ్స్‌ 2022 వేడుకలు, సోమవారం రాత్రి తాజ్ శాంతాక్రూజ్‌లో జరిగిని. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సోనూసూద్ సేవా గుణాన్ని గుర్తించి అతని ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డుతో సత్కరించింది.

ఈ అవార్డుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చేతులు మీదగా సోనూ అందుకున్నాడు. ఇక సోనూసూద్ మాట్లాడుతూ.. “వెనకబడిన కుటుంబాలకి ఆరోగ్యకరమైన ఒక మంచి జీవితాన్ని అందించడమే నా లక్ష్యం. ఈరోజు సూద్ ఛారిటీ ఫౌండేషన్స్ ప్రయత్నాలకు ఇంతటి గుర్తింపు లభిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ కారిక్రమానికి హేమ మాలిని, తమనా భాటియా, మధుర్ భండార్కర్ మరియు ఫరాఖాన్ సినీప్రముఖులు కూడా హాజరయ్యారు.

Sonu Sood Wins Prestigious ‘Nation’s Pride’ Award At Society Achievers Awards 2022

Sonu Sood Wins Prestigious ‘Nation’s Pride’ Award At Society Achievers Awards 2022