హైదరాబాద్ లో ‘సూర్యవంశీ’

అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటిస్తున్న‘సూర్యవంశీ’ క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.. అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు..

  • Published By: sekhar ,Published On : October 4, 2019 / 10:04 AM IST
హైదరాబాద్ లో ‘సూర్యవంశీ’

Updated On : October 4, 2019 / 10:04 AM IST

అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటిస్తున్న‘సూర్యవంశీ’ క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.. అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు..

అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కాంబోలో రూపొందుతున్న సినిమా ‘సూర్యవంశీ’.. కత్రినా కైఫ్ హీరోయిన్ కాగా, అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్ శెట్టి పిక్చర్స్, ధర్మా ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.

క్లైమాక్స్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ కోసం ఆర్ఎఫ్‌సీలో సెట్ వేశారు. రీసెంట్‌గా కత్రినా సెట్‌లోకి అడుగు పెట్టగా.. అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ త్వరలో షూట్‌లో జాయిన్ అవనున్నారు. 2020 మార్చి 27న ‘సూర్యవంశీ’ విడుదల కానుంది.

Read Also : సైరా టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్!

మ్యూజిక్ : హిమేష్ రేష్మియా, తనిష్క్ బాగ్చీ, గురు రంధావా, సినిమాటోగ్రాఫీ : జోమోన్ టి.జాన్, నిర్మాతలు : హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అరుణ భాటియా, అపూర్వ మెహతా, రోహిత్ శెట్టి.