Park Bo Ram : K-పాప్ సింగ‌ర్ హ‌ఠాన్మర‌ణం.. శోక‌సంద్రంలో అభిమానులు

ప్ర‌ముఖ ద‌క్షిణ కొరియా పాప్ సింగ‌ర్ పార్క్ బో రామ్ మ‌ర‌ణించింది.

Park Bo Ram : K-పాప్ సింగ‌ర్ హ‌ఠాన్మర‌ణం.. శోక‌సంద్రంలో అభిమానులు

South Korean singer Park Bo Ram

South Korean singer Park Bo Ram : సంగీత ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌క్షిణ కొరియా పాప్ సింగ‌ర్ పార్క్ బో రామ్ మ‌ర‌ణించింది. ఆమె వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాలు. ఏప్రిల్ 11 గురువారం అర్థ‌రాత్రి ఆమె చ‌నిపోయింది. ఆమె మ‌ర‌ణాన్ని ఆమె ఏజెన్సీ XANADU ఎంటర్‌టైన్‌మెంట్ ధ్రువీక‌రించింది. అయితే ఆమె మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

ఆమె చ‌నిపోవ‌డానికి కొన్ని గంట‌ల ముందు త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఆ పార్టీలో ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి మ‌ద్యం తాగింది. రాత్రి 9.55 గంట‌ల స‌మ‌యంలో ఆమె రెస్ట్‌రూం అని వెళ్లింది. ఎంత‌సేపైనా ఆమె తిరిగి రాక‌పోవ‌డంతో స్నేహితులు వెళ్లి చూడ‌గా.. సింక్ పై అప‌స్మార‌క స్థితిలో క‌నిపించింది.

Rajamouli : రాజమౌళి మొన్న డ్యాన్సులు, ఇవాళ యాడ్స్.. మా సంగతేంటి బాబు అంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్..

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆమె ఇక లేరు అనే వార్త తెలిసి అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

2010లో ఆమెకు 17 ఏళ్ల‌కు ఉండ‌గా సూప‌ర్ స్టార్ కే2 పాట‌ల పోటీలో పాల్గొంది. ఆమె త‌న టాలెంట్‌తో వెలుగులోకి వ‌చ్చింది. 2014లో త‌న సింగిల్ బ్యూటిఫుల్ రిలీజ్‌తో పాప్ మ్యూజిక్‌లోకి అడుగుపెట్టింది. అదే ఏడాది గావ్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్‌లో ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.

Family Star : ఫ్యామిలీ స్టార్ సినిమాలో డిలీటెడ్ సీన్ చూశారా? ఫ్లైట్‌లో అన్ని బ్రాండ్స్ మందు కలిపి విజయ్ ఏం చేసాడంటే..

ఆమె మరణవార్త విన్న సెల‌బ్రెటీలు, అభిమానులు ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నారు.