లైవ్ బ్లాగ్: SP Balu‌కి అశ్రునివాళి

  • Published By: sreehari ,Published On : September 25, 2020 / 06:12 PM IST
లైవ్ బ్లాగ్: SP Balu‌కి అశ్రునివాళి

Updated On : September 25, 2020 / 9:11 PM IST

[svt-event title=”వెంటిలేటర్‌పై బాలుకు ఫిజియోథెరపీ : వీడియో వైరల్..” date=”25/09/2020,9:08PM” class=”svt-cd-green” ] SP Balu Physiotherapy Video Viral: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు బాలు మృతికి నివాళులర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు వెంటిలేటర్‌పై ఉండగా వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. చేతులకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నారు బాలు. కొద్ది సేపటి తర్వాత అలసటతో ఆయన ఆపేశారు. వైద్యులు మళ్లీ చేయించే ప్రయత్నం చేయగా బాలు చేతులు కదపలేక వద్దని వారించారు.

కాగా, కరోనా వైరస్‌ సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. దాదాపు 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు.

ఎస్పీ బాలు అంత్యక్రియలు రేపు ఉదయం (సెప్టెంబర్ 26) 10:30 తర్వాత తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ ఫా‌మ్‌హౌస్‌ లో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముండడంతో అంత్యక్రియలకు కేవలం బంధువులను మాత్రమే అనుమతివ్వాలనే యోచనలో ఉన్నారు. [/svt-event][svt-event title=”బాలు అంత్యక్రియల్లో బంధువులకు మాత్రమే అనుమతి?..” date=”25/09/2020,8:59PM” class=”svt-cd-green” ] #SPBalasubrahmanyamLivesOnForever: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.

ఈరోజు సాయంత్రం ఎంజీఎం హాస్పిటల్ నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ఇంటికి అభిమానుల సందర్శనార్థం బాలు పార్థీవదేహాన్ని తరలించారు. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. అక్కడి జనసందోహాన్ని కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. తర్వాత రెడ్‌హిల్స్‌లోని ఫా‌మ్‌హౌస్‌కు బాలు పార్థివదేహాన్ని తరలించారు.

ఇదిలా ఉంటే ఎస్పీ బాలు అంత్యక్రియలు రేపు ఉదయం (సెప్టెంబర్ 26) 10:30 తర్వాత తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ ఫా‌మ్‌హౌస్‌ లో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముండడంతో అంత్యక్రియలకు కేవలం బంధువులను మాత్రమే అనుమతివ్వాలనే యోచనలో ఉన్నారు. [/svt-event][svt-event title=”సంగీతారుధ్యులు శ్రీపతి పండితారాధ్యుల వారు.. ఎస్పీ బాలు జీవిత విశేషాలు..” date=”25/09/2020,8:55PM” class=”svt-cd-green” ] SPB Life History: * 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం * సాంబమూర్తి, శకుంతల తల్లిదండ్రులు * నెల్లూరు, నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి, అనంతపుపరం, చెన్నైలో విద్యాభ్యాసం * ఆయన భార్య పేరు సావిత్రి * ఆయన కుమార్తె పల్లవి, కొడుకు చరణ్ * 1967లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంతో గాయకుడిగా పరిచయం * శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్యతో కలిసి తొలిపాట పాడారు. `ఏమి ఈ వింత మోహము` అనేది తొలిపాట. * 1966 డిసెంబర్ 15న ఈ పాటను రికార్డింగ్ చేశారు. * `నక్కరే అదే స్వర్గ` చిత్రంలో పి.సుశృలతో `కనసిదో ననసిదో` తొలి కన్నడ పాట * ఆయన పాట పాడిన `హోటల్ రంభ` అనే తమిళ సినిమా విడుదల కాలేదు. * `శాంతి నిలయం` చిత్రంలో పి.సుశీలతో ఆయన పాడిన తొలి తమిళపాట విడుదలైంది.

* ఘంటసాలతో కలిసి ఏకవీర, మంచి మిత్రులు, దేవుడు చేసిన మనుషులు, అలీబాబా 40 దొంగలు, నీతి – నిజాయతీ చిత్రంలో పాడారు. * మలయాళంలో `కడల్ పాలమ్` అనే చిత్రంతో సోలో సాంగ్‌తో పరిచయమయ్యారు. * హిందీలో 1981లో ఏక్ దూజే కేలియే చిత్రంలో తేరే మేరే బీచ్ మే ఆయన పాడిన తొలి పాట. * సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘కన్యాకుమారి’ 1977. * తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. * దాదాపు 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు బాలు * కమల్ హాసన్, భాగ్యరాజా, కుల్భూషన్ కర్బందా, పరేష్ రావెల్, విసు, టి.రాజేందర్, సుమన్, జగపతిబాబు, నరేష్, మోహన్‌లాల్, జెమినీ గణేష్, నాగార్జున (తమిళం), రఘువరన్ కు డబ్బింగ్ చెప్పారు.

* మహమ్మద్ రఫీ, జానకి, ఏసుదాస్, సోనూ నిగమ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. * మాయాబజార్ సినిమా తనకు ఫేవరేట్ అని చెప్పేవారు * యమన్ రాగాన్ని అమితంగా ఇష్టపడేవారు * క్రికెట్, టెన్నిస్ చూడడం ఇష్టం * తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు * తొలిసారి 1972లో మహ్మద్ బీన్ తుగ్లక్ చిత్రంలో `హ్యాపీ బర్త్ డే టూ యూ` అంటూ పాడుతూ కనిపించారు.

*1991లో బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుతో తెలుగు చలనచిత్ర చరిత్రలో గుర్తుండిపోయే ‘ఆదిత్య 369’ చిత్రాన్ని నిర్మించారు.

* మలయాళ యోధ చిత్రాన్ని అనువదించి నిర్మాతగా మారారు. ఎస్.ఎల్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై పిల్లలు పల్లవి – చరణ్ పేరుతో అనువాదం చేశారు. * 1994లో ఎస్.ఎల్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై తమిళంలో `హలో బ్రదర్`ని అనువదించారు. నాగార్జున రెండు పాత్రలకూ తమిళంలో బాలూనే డబ్బింగ్ చెప్పారు. * 1996లో `భామనే సత్యభామనే` చిత్రాన్ని నిర్మించారు. * 2000లో `తెనాలి`, `2005లో `శుభసంకల్పం` నిర్మించారు.

అవార్డులు

* 1999లో తెలుగు యూనివర్శిటీ డాక్టరేట్ అందుకున్నారు.* 2001లో పద్మశ్రీ * 2011 పద్మభూషణ్ * గాయకుడిగా మొదటి చిత్రం మర్యాద రామన్న… చివరి చిత్రం..రవితేజ డిస్కో రాజా * 15 భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు. * అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకుని, ఆయా భాషల్లోని మాటల భావాత్మని తన గొంతులో పలికించి, ఆ భాషల శ్రోతలకు స్వరసామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగిన బాలు తెలుగువాడు కావడం తెలుగువాళ్లు గర్వకారణమని చెప్పాలి.

* బాలు నట గాయకుడు. ఏ నటుడి కోసం పాడుతున్నాడో ఆ నటుడి హావ భావాల్ని, నటనా ధోరణిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని, తదనుగుణంగా గాత్రాన్ని మలిచి పాటకు ప్రాణం పోయడం బాలుకు గొంతుతో పెట్టిన విద్య. * తొలినాళ్ళలో చేయూత నిచ్చిన గురువు పట్ల అభిమానంతో తన సౌండ్ స్టూడియో కి కోదండపాణి పేరును పెట్టడం, తాను దైవంగా భావించే ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం, జానకమ్మ ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేసాననే కృతజ్ఞతాభావంతో బాలు పుట్టినరోజునాడు ఎస్.జానకికి జాతీయ పురస్కారాన్ని అందించడం ఇవన్నీ బాలు సంస్కారానికి, మహోన్నత వ్యక్తిత్వానికి, నిలువెత్తు నిదర్శనాలు.

* పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత అతను ప్రత్యేకత. * గళం విప్పినా… స్వరం కూర్చినా… ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా అతని గళానికి ఉంది.

* తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. * అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు. * పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతను పాటను పండిత పామరులకి చేరువ చేసింది. * శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి.

* 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. * తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. * గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బాల సుబ్రమణ్యం.

* 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలుకు శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్2016) ప్రదానం చేశారు. * బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. పాటలోని మాటలను …గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రమణ్యం. ఆయన గొంతుకు తరాల అంతరాలు తెలియదు. * ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్పీ బాలు.

* తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాల సుబ్రహ్మణ్యం. * బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. * అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. * ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. * తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు. * ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం.

* తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ. * హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. * ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. * తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. * భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.

* గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించాడు బాలు. * నిర్మాతగా ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నాడు. * ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ…బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.

* ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు. * బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది. [/svt-event][svt-event title=”రేపు ఉదయం 10:30 తర్వాత బాలు అంత్యక్రియలు..” date=”25/09/2020,8:32PM” class=”svt-cd-green” ] #SPBalasubrahmanyamLivesOnForever: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.

రేపు (సెప్టెంబర్ 26) ఉదయం 10:30 తర్వాత తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకం గ్రామంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈరోజు సాయంత్రం ఎంజీఎం హాస్పిటల్ నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్‌ ఇంటికి అభిమానుల సందర్శనార్థం బాలు పార్థీవదేహాన్ని తరలించారు. [/svt-event]SPB
[svt-event title=”ఆ గొంతు స్వరాల కార్ఖానా” date=”25/09/2020,7:52PM” class=”svt-cd-green” ] S.P. Balasubrahmanyam: ఎన్టీఆర్ కు పాడితే ఆయనే  పాడిన‌ట్టు, ఏన్నార్ పాడితే పాడితే, మైక్ పట్టుకొని ఆయనే పాడారన్నట్లుగా. కృష్ణంరాజు పాటైతే, ఆయన గొంతులోంచి వచ్చినట్లే. చిరంజీవి బంగారు కోడిపెట్ట పాటవిన్నా…మెగాస్టార్ తెర మీద పాడినట్లే. ఆనాటి నుంచి ఈ త‌రం హీరోల వ‌ర‌కూ అంద‌రూ కూడా గాయ‌కులేమో అనే అనుమానం  పుట్టించిన గాత్రం బాలుది. కథనం చదండి [/svt-event]

[svt-event title=”పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది..బాలు గొప్పతనాన్ని గుర్తించిన ఆనాటి మీడియా” date=”25/09/2020,7:11PM” class=”svt-cd-green” ] మద్రాసులో ఏఎంఐఈ చదవుకుంటూ తనకున్న సంగీత పరిజ్ఞానంతో మద్రాసులో జరిగే సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడుతూ బహుమతులు అందుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి సారిగా 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో తన సినీ ప్రస్ధానాన్ని మొదలెట్టారు. తన సినీ ప్రస్ధానంలో పలు అవార్డులు అందుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు మొదటి సినిమాలో పాడిన పాటలతోటే ఆనాటి మీడియా ఎస్పీబాలు లోని గొప్ప తనాన్ని గుర్తించింది.sp balu article [/svt-event]
[svt-event title=”‘ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేకపోతున్నాం’.. బాలుకు సినీ ప్రముఖుల నివాళి..” date=”25/09/2020,6:45PM” class=”svt-cd-green” ] SP Balasubramanyam – Celebrities Tribute: ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించిన ఆ గానగంధర్వుని స్వరం మూగబోయింది. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 01:4 నిమిషాలకు కన్నుమూసినట్లుగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు. బాలు మరణవార్త వినగానే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి.

సంగీత ప్రియులు, బాలు అభిమానులు ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. బాలు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేస్తున్నారు. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు అర్పిస్తున్నారు. చిత్ర, ఏ.ఆర్. రెహమాన్, హరిహరన్, మోహన్ లాల్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, మోహన్ బాబు, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, రవితేజ, నిఖిల్, రామోజీ రావు, విజయశాంతి, రాజమౌళి, రామ్, ఆర్.మాధవన్, జగపతి బాబు, అల్లరి నరేష్, శర్వానంద్, గుణశేఖర్, అజయ్ దేవ్‌గన్, సల్మాన్ ఖాన్, బోని కపూర్, కొరటాల శివ, సుమన్, రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి, శంకర్, లింగుస్వామి, జిబ్రాన్, థమన్, దేవిశ్రీప్రసాద్, మారుతి తదితరులు బాలు గారికి సంతాపం తెలియచేశారు.

[/svt-event][svt-event title=”భారతదేశ సంగీత ప్రియులకు ఎస్పీబీ మరణం తీరనిలోటు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్” date=”25/09/2020,6:43PM” class=”svt-cd-green” ] భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. యావత్ దేశ సంగీత ప్రియులకు ఎస్పీబీ మరణం తీరనిలోటు అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. గాన చంద్రుడిగా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం.. పద్మభూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు రాష్ట్రపతి సానుభూతి తెలియచేశారు.

[/svt-event][svt-event title=”బాలు స్వహస్తాలతో రాసిన లెటర్ చూశారా!” date=”25/09/2020,6:36PM” class=”svt-cd-green” ] SP Balu Letter with his hand writing: గత 52 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. అశేష అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించారు. అనారోగ్యం నుంచి కోలుకుని బాలు మళ్లీ పాడతారని ఆశించిన సినీ జనం.. ఆయన మరణ వార్తను విని దిగ్భ్రాంతికి లోనయ్యారు.. సినీరాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.. [/svt-event][svt-event title=”బాలు చివరి కోరిక ఏమిటంటే” date=”25/09/2020,6:22PM” class=”svt-cd-green” ] అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం.” అని భక్తులు ఈశ్వరుడ్ని ప్రార్ధిస్తారు. కానీ ఈ కోరిక బాలుకు తీరలేదు. [/svt-event][svt-event title=”ఇంజ‌నీరింగ్ చదివి సింగర్ అయిన బాలు” date=”25/09/2020,6:17PM” class=”svt-cd-green” ] SPBalasubrahmanyam తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. సుస్వరాల స్వరార్చన చేసిన గొంతు మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వుడు , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) ఇక లేరు అనే వార్త సంగీత ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ భువి లో పాట ఉన్నంతకాలం బాలు సజీవంగానే ఉంటారనేది వాస్తవం. [/svt-event][svt-event title=”భారతదేశ సంగీత ప్రియులకు ఎస్పీబీ మరణం తీరనిలోటు.” date=”25/09/2020,6:15PM” class=”svt-cd-green” ] President of India Tribute to SPB: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. [/svt-event][svt-event title=”లైవ్ బ్లాగ్: SP Balu‌కి అశ్రునివాళి” date=”25/09/2020,6:00PM” class=”svt-cd-green” ] బాలుకి సంగీత, సినీ ప్రపంచ సంతాపం [/svt-event]

SPB – Ilaiyaraaja : సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజాతో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం ఉంది. అయితే వీరి మధ్య నెలకొన్న చిన్న వివాదం కారణంగా ఇరువురి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది.