SP Balasubrahmanyam: విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి, తిరగబెట్టిన అనారోగ్యం

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 06:02 PM IST
SP Balasubrahmanyam: విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి, తిరగబెట్టిన అనారోగ్యం

Updated On : September 24, 2020 / 9:40 PM IST

SP Balasubrahmanyam Health: కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది.

కరోనా నుంచి కొలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో బాలు పరిస్థితి విషమంగా మారింది. మరి కాసేపట్లో ఎంజిఎం వైద్యులు బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.

ఆగస్టు 5న కరోనాతో హాస్పిటల్ లో చేరారు బాలు. ఆగస్టు 13న పరిస్థితి విషమంగా వుండడంతో ICU కు తరలించి వెంటిలేషన్ పై ట్రీట్ మెంట్ ఇస్తున్నారు వైద్యులు. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తున్నారు.