లైవ్ బ్లాగ్ : ఇక సెలవ్

BAlu
[svt-event title=”నెల్లూరులోని తన నివాసాన్ని కంచి పీఠానికి ఇచ్చిన బాలు..” date=”26/09/2020,5:44PM” class=”svt-cd-green” ] ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నెల్లూరు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోనేటమ్మపేటలో 1964 జూన్ 4న జన్మించారు బాలు. ఇప్పుడున్న నెల్లూరు జిల్లాగా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పుట్టి పెరిగిన ఊరు కావడంతో బాలుకి నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
ఆ ఊరిలో తన తండ్రి నిర్మించిన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా అందచేశారు బాలు. ఊ ఏడాది ఫిబ్రవరిలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిని తన నివాసానికి ఆహ్వానించి నెల్లూరులోని ఇంటిని విరాళంగా అందిస్తున్నట్లు తెలియచేశారు. బాలులోని సేవాగుణానికి మంత్రముగ్దులైన విజయేంద్ర సరస్వతి ఆ ఇంట్లో వేద పాఠశాల నిర్వహిస్తామని చెప్పారు. పీఠాధిపతి నిర్ణయంతో బాలు ఎంతో సంతోషించారు. తన నివాసం ఒక గొప్ప కార్యక్రమానికి వేదికవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆనాటి కార్యక్రమంలో బాలు చెప్పారు. [/svt-event][svt-event title=”నీ గీతం ఇవాళ ఎందుకు మూగబోయింది? బాలుకి రాజా స్మృతి గీతం..” date=”26/09/2020,4:25PM” class=”svt-cd-green” ] దివి కేగిన దిగ్గజం.. గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు ఆయన [svt-event title=”వైద్యులకు ధైర్యం చెప్పిన SPB..ఆసుపత్రిలో ఏమి జరిగిందంటే” date=”26/09/2020,4:32PM” class=”svt-cd-green” ] ప్రముఖ లెజండరీ సింగర్ బాల సుబ్రమణ్యం చివరి వరకు వైద్యులను ప్రోత్సాహించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఎక్కడా ధైర్యం కోల్పోలేదని ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. V. Sabanayagam (clinical lead, Multidisciplinary Intensive Care, MGM Hospitals) ఆయనకు చికిత్స అందించిన వారిలో ఉన్నారు 52 రోజుల పాటు..ఆయన ఆహ్లాదకరంగా..సంతోషంగా ఉన్నారని, ఆరోగ్యవంతంగా కోలుకోవాలని బాలు అనుకున్నారని వెల్లడించారు.

hospital
కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ Deepak Subramanian సలహా మేరకు ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. అనారోగ్యాన్ని అధిగమించేందుకు ఏమి చేయాలో అది చేయాలని అనుకుంటున్నట్లు బాలు వెల్లడించారని తెలిపారు. మొదటి మూడు రోజులు చాలా బాగానే ఉన్నారని, కానీ..తర్వాత..వ్యాధి ముదిరిపోయిందన్నారు. ఆక్సిజన్ అవసరం వచ్చిందని, ఆగస్టు 09వ తేదీన high dependency unit కు మార్చామన్నారు ఆగస్టు 13వ తేదీన మెరుగైన చికిత్స చేయాల్సి వచ్చిందని, అప్పటికే కోవిడ్ 19లో భాగంగా ప్లాస్మా థెరపీ, ఇతర చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వెంటిలెటర్ లో ఉంచాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని బాలుకు ఎలా చెప్పాలో సందిగ్ధంలో పడిపోయామన్నారు. దీనిపై ..బాలు వాదన చేస్తారని అనుకున్నామన్నారు. కానీ..చేయాల్సింది చేయండి..అనే విషయం చెప్పారన్నారు. ఆక్సిజన్ మరింత అవసరం కావడంతో ఆగస్టు 14వ తేదీన Extracorporeal Membrane Oxygenation (ECMO) పరికరం ఏర్పాటు చేశామన్నారు. దీనితర్వాత..అతను కోలుకున్నట్లు, నిలబడడం, కూర్చొగలగడం చేశారన్నారు. అనూహ్యంగా 48 గంటల తర్వాత..రక్తపోటు పడిపోయందన్నారు. దీని కారణంగా..పెద్ద మొత్తంలో మందులు అవసరమయ్యాయని, మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు స్కాన్ లో ఉందన్నారు. తాము చేస్తున్న ప్రయత్నాలను బాలు కుటుంబం అర్థం చేసుకుందని, కృతజ్ఞతలు తెలిపిందని డాక్టర్ Dr. Sabanayagam చెప్పారు. అయినా..అతని ఆరోగ్యం మరింత క్షీణించిందని చివరకు శుక్రవారం రాత్రి 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారన్నారు. చనిపోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని Suresh Rao (director, Heart and Lung Transplantation Programme) వెల్లడించారు. [/svt-event]స్నేహితుడు ఘన నివాళి అర్పించారు. బాలుకి, మ్యాస్ట్రో ఇళయరాజాకు మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనను విడిచిపెట్టి అనంతలోకాలకు వెళ్లిపోయిన స్నేహితుడు బాలు కోసం, ఇళయరాజా ఓ స్మృతి గీతాన్ని తయారు చేసి ఆయనకు అంకితమిచ్చారు.
‘‘గాన గంధర్వుడా… గండు కోయిలా… నీ గీతం ఇవాళ ఎందుకు మూగబోయింది? గాన గంధర్వుడా… గండు కోయిలా… నీ గీతం ఇవాళ ఎందుకు మూగబోయింది? ఒక్కటేగా ఆయుష్షు .. ఇవాళ శాంతించిందా? శాంతించిందా? పాడి పాడి.. ప్రేమను పెంచాడు… పొగిడి పొగిడి… దేవుళ్లను స్తుతించాడు… సంగీతమనే గగనం… హద్దుల్ని కొలిచాడు ఉన్న ప్రాణాన్నంతా పాటకే ఖర్చుచేశాడు… యుగాలెన్నిటినో దాటి… నీ ప్రాణ సవ్వడి వాయు మండలంలో జీవంతోనే ఉన్నా… కంటి ముందు నిన్ను చూసుకునే వరం దొరుకుతుందా… మళ్లీ ఓ వరం అందుతుందా…. అంజలి… అంజలి…. గాన జాబిలికి మౌన అంజలి… అంజలి… అంజలి…. గాన జాబిలికి మౌన అంజలి’’… [/svt-event][svt-event title=”బాలుకి నివాళి..” date=”26/09/2020,2:38PM” [svt-event title=”వెంటాడి.. వెంటాడి తీసుకుపోయింది.. బాలు మరణం పట్ల సుశీలమ్మ భావోద్వేగం..” date=”26/09/2020,2:53PM” class=”svt-cd-green” ] Susheela Tribute to SP Balu: కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదని, వెంటాడి.. వెంటాడి అందరికి కావాల్సిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంను తీసుకుపోయిందని గానకోకిల పి.సుశీల అన్నారు. బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. బాలు మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.
దేశ, విదేశాల్లో ఎస్పీకి మంచి పేరు ఉందన్నారు. బాలు సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఘంటసాలనే మెప్పించారని.. మంచి పాటలు పాడి ఆయనను మరిపించారని సుశీల అన్నారు. బాలుతో అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఎన్నో కచేరీలు చేశామని సుశీల తెలిపారు. దాదాపు 55 ఏళ్ల పాటు ఇద్దరం కలిసి వేల పాటలు పాడామన్నారు. బాలుని మరచిపోవాలంటే చాలా కష్టమని, అలాంటి వ్యక్తి ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు సుశీలమ్మ. [/svt-event][svt-event title=”బాలుకి నివాళి..” date=”26/09/2020,2:20PM”class=”svt-cd-green” ] అందరికీ శెలవంటూ గాన గంధర్వుడు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో పాటకు వన్నె తెచ్చి, ప్రేక్షకాభిమానులను సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన ఎస్పీ బాలు అందరినీ శోకసంద్రంలో ముంచేశారు. సినీ పరిశ్రమ ఇంకా బాలు మరణవార్తను జీర్ణించుకోలేకపోతోంది. సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలు, వీడియోలు షేర్ చేస్తూ పలు భాషలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులంతా బాలుకు నివాళులర్పిస్తున్నారు.
జైపూర్ లో షూటింగులో ఉన్న రాజేంద్రప్రసాద్, రాధిక, తాప్సీ, విజయ్ సేతుపతి తదితరులు లొకేషన్ లో బాలు మృతికి సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. శనివారం బాలు అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కన్నీటిపర్యంతమవుతూ బాలుకు తుది వీడ్కోలు పలికారు.
[/svt-event][svt-event title=”బాలు అంత్యక్రియలకు హాజరైన దళపతి విజయ్” date=”26/09/2020,2:24PM” class=”svt-cd-green” ] SPB Last Rites: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ హాజరయ్యారు. బాలు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. బాలుతో విజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ‘ప్రియామనవాలే’ అనే తమిళ సినిమాలో నటించారు.
ఈ సూపర్ హిట్ చిత్రంలో బాలు, విజయ్ తండ్రీ కొడుకులుగా నటించారు. బాలు అంత్యక్రియలు ఆయనకు అత్యంత ఇష్టమైన, ఆయన సంతోషంగా గడిపిన తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్ (ఫామ్‌హౌస్) లో జరిగాయి. బాధాతప్త హృదయాలతో బాలు పార్థివ దేహాన్ని ఖననం చేశారు. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కన్నీటిపర్యంతమవుతూ బాలుకు తుది వీడ్కోలు పలికారు. [/svt-event][svt-event title=”దివికేగిన దిగ్గజం..” date=”26/09/2020,12:54PM” class=”svt-cd-green” ] ఇక శెలవు అంటూ గాన గంధర్వుడు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో పాటకు వన్నె తెచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందరినీ శోకసంద్రంలో ముంచేశారు. సినీ పరిశ్రమ ఇంకా బాలు మరణవార్తను జీర్ణించుకోలేకపోతోంది. బాలు అంత్యక్రియలు ఆయనకు అత్యంత ఇష్టమైన, ఆయన సంతోషంగా గడిపిన తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్ (ఫామ్‌హౌస్) లో జరిగాయి.

BAlu
బాలు పార్థివ దేహానికి వైదిక శైవ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు అంతిమ క్రతువు నిర్వహించారు. అంత్యక్రియలకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే అనుమతినిచ్చారు. బాలు కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరి ఎస్పీ శైలజ, బావమరిది శుభలేఖ సుధాకర్, మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. దళపతి విజయ్ అక్కడకు చేరుకుని బాలుకు నివాళులర్పించారు. తనయుడు చరణ్‌ను ఆయన ఓదార్చారు. అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపారు.. బాధాతప్త హృదయాలతో బాలు పార్థివ దేహాన్ని ఖననం చేశారు. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కన్నీటిపర్యంతమవుతూ బాలుకు తుది వీడ్కోలు పలికారు. [/svt-event][svt-event title=”బాలుకి దళపతి విజయ్ నివాళి..” date=”26/09/2020,12:41PM” class=”svt-cd-green” ] బాలుకి దళపతి విజయ్ నివాళి..
[/svt-event]గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యంకు కన్నీటి వీడ్కోలు పలికారు. అత్యంత సన్నిహిత కుటుంబసభ్యుల మధ్య బాలు అంత్యక్రియలు జరిగాయి. చెన్నై సమీపంలోని తామరైపాకం ఫాం హౌజ్ లో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాలు జరిగాయి.
కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలు కొడుకు చరణ్ వైదిక కార్యక్రమాలు చేశారు. బాలుకు చివరిసారి చూసేందుకు చిత్రరంగానికి చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. బాలుకు అత్యంత ఆప్తుడిగా ఉన్న డైరెక్టర్ భారతీరాజా నివాళి అర్పించారు.
ఉదయం 10.30గంటలకు అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభించారు. బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటితో వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అభిమానులు ఎవరూ రావద్దని చెప్పినా..తండోపతండాలుగా వచ్చారు. అభిమానులు పోటెత్తే సరికి..కొద్ది మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. క్షేమంగా హాస్పిటల్ నుంచి వచ్చి.. ఎప్పటిలానే తన గాత్రంతో అలరించాలని ప్రార్థనలు చేశారు. కానీ… చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆయన ఇక లేరని తెలుసుకున్న అభిమానులు, పలువురు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంగీత ప్రపంచం మూగబోయింది. తమిళనాడు సీఎం పళని స్వామి ఏపీ తరపున బాలు సొంత జిల్లాకి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు హాజరయ్యారు.
ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో బాలు చేరారు.
ఈ విషయాన్ని బాలు స్వయంగా వెల్లడించారు. కరోనా సోకింది, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఆందోళన, అభిమానాన్ని అర్థం చేసుకోగలను. పరామర్శించేందుకు దయచేసి ఫోన్ చేయకండి’ అని ఆస్పత్రి నుంచి వాట్సాప్ వీడియో విడుదల చేశారు.
ఆగస్టు 13న బాలు ఆరోగ్యం విషమించింది. దీంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. అయితే..ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఎక్మో సహాయంతో చికిత్స అందించారు. డాక్టర్లు ఫిజియోథెరపీ చేశారు. క్రమేపీ కోలుకున్నారు. కరోనా పరీక్షలు నిర్వహంచారు. నెగెటివ్ రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
5వ తేదీన 51వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఆస్పత్రిలో సతీమణి సావిత్రితో కేక్ కట్ చేసి సంతోషంగా గడిపారు. ఈ నెల 23న రాత్రి బాలు ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన కుటుంబీకులను వైద్యులు హడావిడిగా ఆస్పత్రికి పిలిపించారు.
సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని ఎస్పీ చరణ్ ప్రకటించారు.
[/svt-event][svt-event title=”బాలు అంత్యక్రియలు ప్రారంభం..” date=”26/09/2020,11:36AM” class=”svt-cd-green” ] SP Balu Funeral
Ceremony: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.
https://youtu.be/YQfGmE5-Ry0
బాలు అంత్యక్రియలు ఆయనకు అత్యంత ఇష్టమైన రెడ్‌హిల్స్ ఫామ్‌హౌస్‌లో తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
https://youtu.be/06N_PmeRcOA
కాగా అంత్యక్రియలకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే అనుమతినిచ్చారు. బాలు కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరి ఎస్పీ శైలజ, మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు.[/svt-event]
బాలు పార్థీవదేహానికి చిత్రరంగానికి చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. శుభలేఖ సుధాకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నేపధ్య గాయకుడు మనో, దర్శకుడు భారతీరాజలు నివాళులు అర్పించారు. ఎస్పీ బాలు భౌతిక కాయాన్ని చూసి దర్శకుడు భారతీరాజ కన్నీటి పర్యవంతమైయ్యారు.
బాలు అంతక్రియలు పూర్తి
ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోల మధ్య జరిగాయి.
చెన్నై సమీపంలోని తామరైపాకం ఫాం హౌజ్ లో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాలు జరిగాయి. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలు కొడుకు చరణ్ వైదిక కార్యక్రమాలు చేశారు.