Sravani suicide : మై లవ్ లీ హీరో దేవ్ రాజ్…శ్రావణి లెటెస్ట్ వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 01:57 PM IST
Sravani suicide : మై లవ్ లీ హీరో దేవ్ రాజ్…శ్రావణి లెటెస్ట్ వీడియో వైరల్

Updated On : September 11, 2020 / 3:14 PM IST

మై లవ్ లీ హీరో దేవ్ రాజ్…అంటూ బుల్లి తెర నటి శ్రావణి లెటెస్ట్ వీడియో వైరల్ అవుతోంది. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది తెలియరావడం లేదు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సాయి, దేవ్ రాజ్ లు ఇద్దరూ కీలకంగా మారారు. వీరికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.




తాజాగా నటి శ్రావణి చేసిన వీడియో సంచలనం రేకేత్తిస్తోంది. దేవ్ రాజ్ పట్టిన రోజు సందర్భంగా…శ్రావణి చేసిన వీడియో బయటపడింది. మై లవ్ లి హీరో దేవ్ రాజ్ మాట్లాడింది. ‘దేవ రాజ్ ను హార్ట్ చేసినందుకు శ్రావణి సారీ చెప్పింది. దీంతో ఈ వీడియోలు కీలకంగా మారాయి.

‘హాయ్ ఎక్కడున్నావు ? ఏం చేసున్నావు ? డైలీ ఇలాగే మాట్లాడుకుందాం..కొన్ని విషయాలు ఎప్పుడు చెప్పలేదు. ప్రశాంతంగా విను..ఎవరితో క్లోజ్ ఇంతగా అవ్వలేదు. ఫ్యామిలీ మెంబర్ గా మెలిగావు. సూచనలు, సలహాలు ఇస్తుంటే హ్యాపీగా ఉంటుంది.




చాలాసార్లు హార్ట్ చేసినా..ఇందుకు సారీ చెబుతున్నా. ఒక్క మాట అనలేదు. ఎవరినీ హార్ట్ చేయవు. నీవు మంచిగా ఉంటావు. అమ్మ, చెల్లిని మంచిగా చూసుకో. పుట్టిన రోజు శుభాకాంక్షలు..గుడ్ నైట్ ’ అంటూ..శ్రావణి చేసిన ఈ వీడియో కలకలం రేపుతోంది.

శ్రావణి ఆత్మహత్య కేసులో దేవ్ రాజ్ కీలక విషయాలు వెల్లడించాడు. గతంలో తనపై పెట్టిన పోలీసు కేసు, శ్రావణితో తనకున్న పరిచయం..ఇతరత్రా ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు. ఇక సాయి చేసిన దారుణాలకు సంబంధించి కీలక అంశాలను చెప్పినట్లు సమాచారం.
https://10tv.in/is-sai-krishna-ready-to-blame-for-actress-sravani-suicide-dev-raj-reveals-key-points/



గతంలో తనను రక్తం వచ్చినట్లు కొట్టిన ఫొటోలను కూడా చూపించాడు. గంటల తరబడి పోలీసులు ఇతడిని విచారిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని సాయికు కూడా నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 11వ తేదీ శనివారం విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇతని విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయో చూడాలి.