కళ్యాణిపై కక్ష తీర్చుకుంటుందిగా..
నటి శ్రీరెడ్డి తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చెన్నై పోలీసు కమీషనర్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది..

నటి శ్రీరెడ్డి తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చెన్నై పోలీసు కమీషనర్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది..
చెన్నై: శ్రీరెడ్డి పేరు వార్తల్లో వినబడింది అంటే ఏదో కొత్త వివాదం మొదలైనట్టే.. కొద్దికాలంగా శ్రీరెడ్డి తమిళనాడులో మకాం పెట్టింది. అక్కడ చిన్నా చితకా తమిళ సినిమాలు చేస్తోంది. ఊరు మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది.. బ్లండ్ ఎందుకు మారుతుంది? అనే సినిమా డైలాగులా చెన్నై పోయినా కానీ తెలుగు ఇండస్ట్రీ వ్యక్తుల్ని ఏదోలా కదిలిస్తూనే ఉంది.
ఈ సారి ఏకంగా హత్యా బెదిరింపుల కింద కేసు పెట్టింది. తనపై నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్ హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇటీవల నటి శ్రీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో తమపై అసత్య ఆరోపణలు, అసభ్యకర పోస్టులు చేస్తుందంటూ కరాటే కల్యాణి, డాన్స్ మాస్టర్ రాకేశ్ తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వీరిపై ఫిర్యాదు చేసింది. తాను తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నానని, ఇల్లు, కారు కొన్నానని దీనిపై కల్యాణి, రాకేష్ సోషల్ మీడియాలో తన గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తనను పెట్రోలు పోసి తగలపెడతామని బెదిరిస్తున్నారంటూ శ్రీరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొంది. శ్రీరెడ్డి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read More>>ప్రభాస్ 21.. ప్యాన్ ఇండియా కాదు.. అంతర్జాతీయ సినిమా..
See Also>>బాలీవుడ్ హీరోతో మహేష్ బాబు మల్టీ స్టారర్: చిరంజీవి సినిమా తర్వాతేనా?