Arjuna Phalguna : బలైపోడానికి నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని..
‘అర్జున ఫల్గుణ’ మూవీలో శ్రీవిష్ణు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు..

Arjuna Phalguna Teaser
Arjuna Phalguna: ఇటీవల ‘రాజ రాజ చోర’ అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రామిసింగ్ యాక్టర్ శ్రీ విష్ణు. ఇప్పుడు ‘అర్జున ఫల్గుణ’ అనే మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమిృత హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
NTR 30 : తారక్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో పూజ..
ఫస్ట్ మూవీ ‘జోహార్’ తో ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ మర్ని డైరెక్ట్ చేస్తున్నారు. మంగళవారం ‘అర్జున ఫల్గుణ’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీవిష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు.
Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!
‘ప్రతీ సారి డిఫరెంట్‌గా వస్తున్నా.. ఈ సారి కూడా డిఫరెంట్‌గానే వస్తున్నా కానీ పక్కా ఊర మాస్ రోల్‌తో’ అంటూ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు శ్రీ విష్ణు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.