Samajavaragamana : ‘సామజవరగమన’తో కెరీర్ హైయెస్ట్ అందుకున్న శ్రీవిష్ణు.. 7 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో సామజవరగమన సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక మొదటి వారంతో ఈ మూవీ..

Samajavaragamana : ‘సామజవరగమన’తో కెరీర్ హైయెస్ట్ అందుకున్న శ్రీవిష్ణు.. 7 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Sree Vishnu Samajavaragamana first week collections

Samajavaragamana : టాలీవుడ్ యువ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu).. అందరి హీరోలా కాకుండా వైవిధ్యమైన కథలకి, పాత్రలకు ప్రాధాన్యతని ఇస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంటాడు. తాజాగా ఈ హీరో ‘సామజవరగమన’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత వారం జూన్ 29న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతుంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజా రాజా చోర సినిమాలు తరువాత సామజవరగమనతో శ్రీవిష్ణు ఆడియన్స్ ని ఆ రేంజ్ లో అలరించాడు.

Salaar : అప్పుడు సాహో.. ఇప్పుడు సలార్.. టీజర్‌లో ఎలివేషన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి ఈ సినిమా 19.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక మొదటి వారం పూర్తి చేసుకునేపాటికి ఈ చిత్రం 30.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. శ్రీవిష్ణు కెరీర్ లోనే ఇది హైయెస్ట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా ఈ మూవీ ఆడియన్స్ ని థియేటర్ వద్దకి రప్పిస్తుంది. మరి కంప్లీట్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sree Vishnu (@sreevishnu29)

కాగా ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడిగా రెబా మోనికా జాన్ (Reba Monica John) నటించగా నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యింగర్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ వంటి స్టార్ కాస్ట్ కనిపించారు. రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రాజెశ్ దండా ఈ సినిమాని నిర్మిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ఈ మూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరించాడు. గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చాడు.