Sreeleela – Kartik Aaryan : అయితే శ్రీలీల – బాలీవుడ్ హీరో డేటింగ్ నిజమేనా? కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పిన మాటలతో..
గత కొన్ని నెలలుగా శ్రీలీల బాలీవుడ్ వెళ్లినప్పటి నుంచి ఆమెపై గాసిప్స్ వస్తున్నాయి.

Sreeleela Kartik Aaryan Dating Rumors goes Viral in Bollywood
Sreeleela – Kartik Aaryan : మన దగ్గర సెలబ్రిటీల మీద గాసిప్స్ తక్కువ కాని బాలీవుడ్ కి వెళ్తే ఆ గాసిప్స్ బాగా పెరిగిపోతాయి. శ్రీలీల ఇటీవలే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో తన మొదటి సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ప్రకటించకపోయినా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది ఆషికీ 3 సినిమా అని అంటున్నారు.
ఇన్నాళ్లు శ్రీలీల మీద గాసిప్స్ రాలేదు. కానీ గత కొన్ని నెలలుగా శ్రీలీల బాలీవుడ్ వెళ్లినప్పటి నుంచి ఆమెపై గాసిప్స్ వస్తున్నాయి. శ్రీలీల బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందని బాలీవుడ్ మీడియా అంటుంది. తాజాగా కార్తీక్ ఫ్యామిలీ ఈవెంట్ కి శ్రీలీల కార్తీక్ తో కలిసి మరి వెళ్ళింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి.
దీంతో శ్రీలీల – కార్తీక్ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.
తాజాగా ఓ అవార్డు ఈవెంట్లో కరణ్ జోహార్ – కార్తీక్ ఆర్యన్ తల్లి మధ్య సంభాషణ జరగ్గా కార్తీక్ ఆర్యన్ తల్లి తమ ఇంటికి కాబోయే కోడలు గురించి మాట్లాడుతూ.. ఇంట్లో డాక్టర్ అమ్మాయి రావాలని డిమాండ్ చేస్తున్నారు అంది. అయితే శ్రీలీల కూడా డాక్టర్ కావడంతో బాలీవుడ్ మీడియా కార్తీక్ ఆర్యన్ – శ్రీలీల డేటింగ్ నిజమేనేమో, కార్తీక్ తల్లి కూడా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చింది అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో శ్రీలీల – కార్తీక్ ఆర్యన్ లకే తెలియాలి. ఇక శ్రీలీల త్వరలో నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.